AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ఐ-హబ్‌, గుజరాత్ వీ-హబ్ మధ్య అవగాహన ఒప్పందం.. మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్..

Telangana: దేశంలో మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ-గుజరాత్ రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

Telangana: తెలంగాణ ఐ-హబ్‌, గుజరాత్ వీ-హబ్ మధ్య అవగాహన ఒప్పందం.. మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్..
Shiva Prajapati
|

Updated on: Jan 16, 2021 | 9:59 PM

Share

Telangana: దేశంలో మహిళా ఇన్నోవేషన్ బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ-గుజరాత్ రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మహిళా ఒన్నోవేషన్‌లో గుజరాత్ ఐ-హబ్‌కి తెలంగాణకు చెందిన వీ-హబ్ సహకారం అందించనుంది. ఆమేరకు ఇవాళ ఐ-హబ్, వి-హబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, గుజరాత్ మంత్రులు భూపేంద్రసింగ్ చుదాసమా, విభవారి బెన్‌ దేవ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు రాష్ట్రాల్లోని 240 మంది ఔత్సాహిక మహిళా స్టార్ట్‌ అప్‌లను గుర్తించి వారికి చేయూత అందిస్తారు.

ఒప్పంద కార్యక్రమం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. వీ-హబ్ ద్వారా ఇప్పటికే విమెన్ ఇన్నోవేషన్‌కి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. ఇలాంటి భాగస్వామ్యం ద్వారా దేశంలో మహిళా ఇన్నోవేషన్ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇన్నోవేషన్ రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా, ఒక ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఈ ఒప్పందం సందర్భంగా వీ-హబ్‌కి గుజరాత్ రాష్ట్ర విద్యాశాఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇండ్రస్టీస్‌ అండ్‌ కామర్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, గుజరాత్‌ ప్రభుత్వ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అంజుశర్మ పాల్గొన్నారు.

Also read:

Encounter: చత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఫర్సేఘాట్ యాక్షన్ టీమ్ కమాండర్ సయాబో మృతి..

Bigg boss season 2: ఓ ఇంటివాడైన బిగ్‌బాస్ సీజన్2 విన్నర్ కౌశల్.. భార్యా పిల్లలతో కలిసి సంప్రదాయం పద్ధతిలో నూతన గృహ ప్రవేశం..

Follow Us
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగ సంతానం.. అయినా ఆస్పత్రిలోనే ఆమె ఈ పని
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
IND vs SL: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
రాజధాని అమరావతిలో కీలక ఘట్టం ఆవిష్కృతం
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
డ్రైవింగ్ ప్రాక్టీస్ చేద్దామని కారును బయటకు తీసిన మహిళ.. ఇంతలోనే
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..