Bigg boss season 2: ఓ ఇంటివాడైన బిగ్‌బాస్ సీజన్2 విన్నర్ కౌశల్.. భార్యా పిల్లలతో కలిసి సంప్రదాయం పద్ధతిలో నూతన గృహ ప్రవేశం..

Bigg boss season 2 winner kaushal: బిగ్ బాస్ సీజన్ 2 విజేత, నటుడు కౌశల్ ఓ ఇంటివాడయ్యాడు. తన భార్య పిల్లలతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాడు.

Bigg boss season 2: ఓ ఇంటివాడైన బిగ్‌బాస్ సీజన్2 విన్నర్ కౌశల్.. భార్యా పిల్లలతో కలిసి సంప్రదాయం పద్ధతిలో నూతన గృహ ప్రవేశం..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 9:44 PM

Bigg boss season 2 winner kaushal: బిగ్ బాస్ సీజన్ 2 విజేత, నటుడు కౌశల్ ఓ ఇంటివాడయ్యాడు. తన భార్య పిల్లలతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలో కౌశల్ తన భార్యా పిల్లలతో కలిసి సంప్రదాయ పద్ధతిలో గృహప్రవేశం చేస్తున్నట్లుగా ఉంది. పట్టు వస్త్రాలు ధరించిన కౌశల్ దంపతలిద్దరూ ఇంటి గుమ్మం ముందు గుమ్మడి కాయ కొట్టి నూతన గృహంలోకి అడుగు పెట్టారు. కౌశల్ టెలివిజన్ నటుడు, మోడల్, బిజినెస్ మాన్ , యాడ్స్ కు దర్శకత్వం చేస్తాడు. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ బుల్లి తెరతో పాటు అనేక సినిమాలలో నటించాడు. చక్రవాకం సీరియల్, రాజకుమారుడు, వెంకీ, మిస్టర్ పెరఫెక్ట్ వంటి అనేక సినిమాల్లో కౌశల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.

అలాగే ద లుక్స్ ప్రొడక్షన్స్ అనే మోడల్ మేనేజ్‌మెంట్ ఏజన్సీని స్థాపించి సుమారు 230కి పైగా వాణిజ్య ప్రకటనలను రూపొందించాడు. తెలుగు టీవీ చరిత్రలో సంచలనం సృష్టించిన బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్, నాని చేతుల మీదుగా కౌశల్ బిగ్‌బాస్ ట్రోఫిన్ గెలుచుకోవడంతో పాటు.. రూ.50 లక్షల నగదును అందుకున్నాడు. బిగ్‌బాస్ ముందు వరకు కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన కౌశల్.. బిగ్‌బాస్ విజేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

Also read:

COVID Vaccine : దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ విజయవంతం.. తొలి రోజు 1,91,181 మంది టీకా..

Maharashtra Corona Updates: మహారాష్ట్రలో 19,87,678కి చేరిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.