CS Somesh Kumar: అధికారులతో సీఎస్ సోమేష్‌కుమార్ సమీక్ష.. పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం
CS Somesh Kumar: సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల వరకు అన్ని విభాగాలలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన...
CS Somesh Kumar: సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల వరకు అన్ని విభాగాలలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శనివారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో వివిధ శాఖలలో పదోన్నతుల ప్రక్రియపై సమీక్షించారు. ఈ ప్రక్రియకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందున పదోన్నతులలో ఉండే సాంకేతిక సమస్యలను పరిష్కరించి మార్గదర్శకాల ప్రకారం డీపీసీలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు, జిఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి సబ్యసాచి , ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ సీనియర్ కన్సల్టెంట్ శివ శంకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.