Chain Snatcher: అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. బయటకు టిప్ టాప్‌గా కనిపిస్తాడు.. కానీ చేసే పనులు తెలిస్తే మాత్రం షాక్ అవుతారు..
Chain Snatcher: అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. బయటకు టిప్ టాప్‌గా కనిపిస్తాడు.. కానీ చేసేవి మాత్రం పక్కా వెధవ పనులు. ఒంటరిగా నడుచుకుంటూ
Chain Snatcher: అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. బయటకు టిప్ టాప్‌గా కనిపిస్తాడు.. కానీ చేసేవి మాత్రం పక్కా వెధవ పనులు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను టార్గెట్‌గా చేసుకుంటాడు. అదును చూసి మెడలో ఉన్న చైన్లను కొట్టేస్తాడు. కానీ, అన్ని వేళలు ఒకేలా ఉండవు కదా.. తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఈ చైన్ స్నాచర్ ఆటకట్టించారు. సాఫ్ట్‌వేర్ రామకృష్ణ(37)ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 7వ తేదీన ఓ మహిళ మెడలో నుంచి రామకృష్ణ చైన్‌ను దొంగిలించాడు. చైనా స్నాచింగ్ చేసిన అనంతరం రామకృష్ణ తన దుస్తులు మార్చుకుని తప్పించుకున్నాడు. అయితే ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దాని ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. రామకృష్ణను శనివారం నాడు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 30 గ్రాముల బంగారం, రెండు టూ వీలర్ బండ్లను, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Also read:
Telangana: తెలంగాణ ఐ-హబ్, గుజరాత్ వీ-హబ్ మధ్య అవగాహన ఒప్పందం.. మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్..