Bank Cheating Case: ఎస్‌బీఐకి రూ.65 కోట్లు టోకరా పెట్టాడు.. ఐదేండ్ల నుంచి తప్పించుకు తిరిగాడు.. చివరికి అడ్డంగా దొరికిపోయాడు..
Bank Cheating Case: ఎస్ఐబీకి రూ.65 కోట్లు టోకరా పెట్టి ఐదేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న జయ్ అంబే గౌరి ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ నరేంద్ర..
Bank Cheating Case: ఎస్ఐబీకి రూ.65 కోట్లు టోకరా పెట్టి ఐదేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న జయ్ అంబే గౌరి ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ నరేంద్ర కుమార్ పటేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర కుమార్ ఎస్‌బిఐ నుంచి రూ. 65 కోట్లు తీసుకుని మోసానికి పాల్పడినట్లు 2015లో ఈడీ అభియోగాలు మోపింది. దాంతో అతను విదేశాలకు పారిపోయాడు. తాజాగా నరేంద్ర కుమార్ పటేల్ ఇండియాకు రాగా.. అహ్మదాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు పారిపోయిన నరేంద్ర కుమార్ కోసం సీబీఐ అధికారులు, ఈడీ అధికారులు మూడేళ్లుగా గాలిస్తున్నారు. తాజాగా అతను పట్టుబడటంతో రిమాండ్‌కు తరలించారు. నరేంద్ర కుమార్‌ను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగా బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.
Also read:
Telangana: తెలంగాణ ఐ-హబ్, గుజరాత్ వీ-హబ్ మధ్య అవగాహన ఒప్పందం.. మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్..