Kishan Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన కిషన్ రెడ్డి… కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామంటూ..
Kishan Reddy Letter To CM KCR: కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ విస్తరణకు..
Kishan Reddy Letter To CM KCR: కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ విస్తరణకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు అవసరమయ్యే నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతోనే పనులు నిలిచిపోయాయని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇక ఎంఎంటీఎస్ విస్తరణ పనుల కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.789 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రూ.414 కోట్లు నిలిచిపోయినందు వల్లే ఎంఎంటీఎస్ విస్తరణ పనులు ఆగిపోయాయని కిషనరెడ్డి పేర్కొన్నారు. విస్తరణ పనులు ఆలస్యమైతే ప్రాజెక్టుపై భారం పడుతుందని కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఇక యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ వెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టాలని, ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Kalthi Kallu: వికారాబాద్ ఘటన మరువక ముందే మహబూబ్‌నగర్‌లో మరో దారుణం.. ఇవాళ మరో ఇద్దరు బలి..