PM Modi: నేడు ఎనిమిది ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ… దేశంలోని పలు ప్రాంతాల నుంచి..

Modi Flag Off Eight Trains: దేశంలోని పలు ప్రాంతాల నుంచి గుజరాత్‌కు ప్రధాని నరేంద్ర మోది ఎనిమిది ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలపై నుంచి వెళ్లే ఈ రైళ్లు గుజరాత్‌లోని..

PM Modi: నేడు ఎనిమిది ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ... దేశంలోని పలు ప్రాంతాల నుంచి..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 5:47 AM

Modi Flag Off Eight Trains: దేశంలోని పలు ప్రాంతాల నుంచి గుజరాత్‌కు ప్రధాని నరేంద్ర మోది ఎనిమిది ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలపై నుంచి వెళ్లే ఈ రైళ్లు గుజరాత్‌లోని కెవడియా రైల్వే స్టేషన్‌కు చేరుకోనున్నాయి. కేవడియాలోని పటేల్‌ ఐక్యతా విగ్రహాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే మోదీ నేడు (ఆదివారం) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఈ కొత్త రైళ్లతో పాటు మరికొన్ని రైల్వే సంబంధిత ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు గుజరాత్‌ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి పాల్గొననున్నారు.

ప్రధాని ప్రారంభించనున్న రైళ్ల వివరాలు..

* రైలు నెంబర్‌ 09103/04 మహమాన ఎక్స్‌ప్రెస్‌ (వీక్లీ) – కెవడియా నుంచి వారనాసి బయలుదేరనుంది.

* రైలు నెంబర్‌ 02927/28 దాదార్‌-కెవడియా ఎక్స్‌ప్రెస్‌ (ప్రతిరోజు) – దాదర్‌, కెవడియాల మధ్య నడవనుంది.

* రైలు నెంబర్‌ 09247/48 జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (ప్రతరోజు) – అహ్మదాబాద్‌, కెవడియా.

* రైలు నెంబర్‌ 09145/46 నిజాముద్దీన్‌-కెవడియా సంప్రక్రాంతి ఎక్స్‌ప్రెస్‌ (వీక్లీ) – కెవడియా, హెచ్‌. నిజాముద్దీన్‌.

* రైలు నెంబర్‌ 09105/06 కెవడియా – రెవా ఎక్స్‌ప్రెస్‌ (వీక్లీ) – కెవడియా, రెవా.

* రైలు నెంబర్‌ 09119/20 చెన్నై-కెవడియా ఎక్స్‌ప్రెస్‌ (వీక్లీ) – చెన్నై, కెవడియా.

* రైలు నెంబర్‌ 09107/08 ఎమ్‌ఈఎమ్‌యూ ట్రైన్‌ (ప్రతిరోజు) – ప్రతాప్‌నగర్‌, కెవడియా.

Also Read: Telangana: తెలంగాణ ఐ-హబ్‌, గుజరాత్ వీ-హబ్ మధ్య అవగాహన ఒప్పందం.. మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్..