Vijay Setupati: పుట్టిన రోజు ఫొటో వివాదంపై స్పందించిన విజయ్ సేతుపతి… క్షమాపణలు చెబుతూ ట్వీట్..
Vijay Sethupathi Clarifies On Birthday photo: తనదైన నటనతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఎంచుకునే పాత్రలో వైవిధ్యం, నటనలో కొత్తదనంతో తెలుగులోనూ...
Vijay Sethupathi Clarifies On Birthday photo: తనదైన నటనతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఎంచుకునే పాత్రలో వైవిధ్యం, నటనలో కొత్తదనంతో తెలుగులోనూ ఈ హీరో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. తాజాగా విజయ్ ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించనున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే శనివారం విజయ్ సేతుపతి పుట్టిన రోజు ఈ సందర్భంగా జరిగిన పుట్టిన రోజు వేడుకలు వివాదానికి దారి తీశాయి. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా విజయ్ కేట్ కట్ చేసిన ఫొటో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురైంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. విజయ్ సేతుపతి తన పుట్టిన రోజున ‘పొన్రం’ షూటింగ్ సెట్‌లో ఒక కత్తితో కేక్ కట్ చేశాడు. ఆ ఫొటోలు కాస్త నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. కొందరు నెటిజన్లు ఆయన తీరును తప్పు పట్టారు. గూండాల మాదిరిగా ఒక ఖడ్గంతో పుట్టిన రోజు కేక్‌కు కట్ చేయడమేంటని కామెంట్లతో హోరెత్తించారు. దీంతో ఈ విషయం ఆ నోట.. ఈ నోట పడి చివరికి విజయ్ సేతుపతి వరకు చేరుకుంది. దీంతో ఈ ట్రోలింగ్‌కు ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలో విజయ్ సేతుపతి హుందాగా వ్యవహరించారు. కేక్‌ను అలా కట్ చేసినందుకు క్షమాపణలు చెబుతూ ట్విట్టర్ వేదికగా ఓ నోట్‌ను పోస్ట్ చేశాడు. అసలు ఆ ఖడ్గంతో కేక్‌ను ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందన్న కారణాన్ని వివరిస్తూ.. ప్రస్తుతం తాను నటిస్తోన్న ‘పొన్రం’ సినిమాలో ‘ఖడ్గం’ కీలక పాత్ర పోషించనుందని.. అందుకే ఆ ‘ఖడ్గం’తో బర్త్ డే కేక్‌ను కట్ చేశానని సేతుపతి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
— VijaySethupathi (@VijaySethuOffl) January 16, 2021