తెలంగాణ కుంభమేళ.. మేడారం జాతరకు అంకురార్పణ.. ఘనంగా గుడిమెలిగే పండుగ
మహాజాతరకు రెండు వారాల ముందు ఈ తంతు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.. అసలు జాతర ఫిబ్రవరి 21 నుండి జరుగుతుంది.. కానీ ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం రెండు వారాల పాటు పూజలు నిర్వహించి మాఘశుద్ద పూర్ణిమ నాడు సమ్మక్క సారక్క దేవతలను గద్దెలపై ప్రతిష్టించి జాతర నిర్వహిస్తారు.
తెలంగాణ కుంభమేళా, మేడారం మహాజాతరకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే మేడారంలో భక్తజనం పోటెత్తుతోంది. మేడారం మహా జాతరకు రెండు వారాల ముందే ఆదివాసీల ఆచార సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.. గుడిమెలిగే తంతు నిర్వహణతో జాతరకు అంకురార్పణ జరిగింది.. అసలు జాతర ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ది కార్యక్రమం అనంతరం మేల తాళాలతో వెళ్లి మేడారంలోని సమ్మక్క దేవాయాన్ని శుద్దిచేశారు.. ఆలయం లోపల అలికి సమ్మక్క ప్రతిరూపానికి పూజలు చేశారు.. అదే సమయంలో కన్నేపల్లిలోని సారలమ్మ దేవాలయంలో కూడా శుద్ది చేసిఆదివాసీ ఆచార సాంప్రాయాల ప్రకారం పూజలు చేశారు.
మేడారంలో గుడిమెలిగే సమయంలోనే ఏటూరునాగారం మండలం కొండాయిలోని గోవిందరాజు, గంగారం మండలం పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం శుద్ది చేసిన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా గుడి మెలిగే పండుగతో మేడారంలో మహా జాతరకు తొలి అడుగు పడుతుంది.
సమ్మక్క – సారక్క గద్దెల వద్ద అడవి నుండి తీసుకొచ్చిన ఎర్రమట్టితో అలుకుచల్లి రంగుల ముగ్గులతో అలంకరించారు.. అనంతరం ఆదివాసీ ఆచార సంప్రదాయం ప్రకారం అలంకరణ చేసిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాజాతరకు రెండు వారాల ముందు ఈ తంతు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.. అసలు జాతర ఫిబ్రవరి 21 నుండి జరుగుతుంది.. కానీ ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం రెండు వారాల పాటు పూజలు నిర్వహించి మాఘశుద్ద పూర్ణిమ నాడు సమ్మక్క సారక్క దేవతలను గద్దెలపై ప్రతిష్టించి జాతర నిర్వహిస్తారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..