Hyderabad: మేడారం మహాజాతరకు ఈ నెల 9 నుంచి ప్రత్యేక బస్సులు.. ఇవి ఛార్జీల వివరాలు..
మేడారం జాతరకు భక్తుల రద్దీ దృష్ట్యా టీఎస్‌ఆర్టీసీ భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తుంది. ప్రతి డిపో నుండి వందల సంఖ్యలో మేడారం కు బస్సులను ఏర్పాటు చేస్తుంది. అలాగే 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు
తెలంగాణాలో జరిగే అతిపెద్ద, గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర. రెండేళ్ల కోసారి జరిగే ఈ వనదేవతల ఉత్సవాన్ని.. తెలంగాణ కుంభమేళగా కూడా పిలుస్తారు.. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఈ మహాజాతర జరగనుంది. ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర జరగబోతుంది. ప్రతి సంవత్సరం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది.. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. లక్షలు, కోట్లలో బారులు తీరుతున్న భక్తజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జాతరను నిర్వహిస్తోంది. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సమకూర్చుతుంది. ఈ క్రమంలో TSRTC భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తుంది.
మేడారం జాతరకు భక్తుల రద్దీ దృష్ట్యా టీఎస్‌ఆర్టీసీ భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తుంది. ప్రతి డిపో నుండి వందల సంఖ్యలో మేడారం కు బస్సులను ఏర్పాటు చేస్తుంది. అలాగే 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు తెలిపింది. అలాగే, ఈ నెల-9 నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఎ.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి 3 బస్సులు, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి రెండు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పెద్దలకు రూ.750 పిల్లలకు రూ.450గా బస్సు ఛార్జీలను నిర్ణయించామన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇకపోతే, సమ్మక్క-సారలమ్మ జాతరలో ప్రధాన మొక్కు భక్తులు అమ్మవారికి ‘బంగారం’గా సమర్పించే బెల్లం..ఇప్పుడు ప్రభుత్వం బెల్లం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బెల్లం సమర్పించాలనుకునే భక్తులకు ఆధార్ తప్పనిసరి చేసింది.. బెల్లం సమర్పించే భక్తులు తమ ఆధార్ జిరాక్స్ కాపీని కౌంటర్లలో సమర్పించాలని సూచించింది.. భక్తులు తమ పేరు, ఫోన్ నంబర్, బెల్లం కొనుగోలు ఉద్దేశం తదితర వివరాలను తప్పనిసరిగా అందించాలని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఎక్సైజ్ సిబ్బంది డేటాను క్రోడీకరించి ప్రతిరోజూ జిల్లా స్థాయి అధికారులకు సమర్పించాలి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..