AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు..! ట్యాంకర్‌ బోల్తాపడి వాళ్లేడుస్తుంటే.. బిందేలు, బక్కెట్లతో పరిగెత్తిన ఊరోళ్లు

ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ప్రమాదం జరిగిన తర్వాత ప్రజలు ఏం చేశారనేది షాకింగ్. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇండ్ల నుంచి బకెట్లు, డబ్బాలతో ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారో వీడియోలో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు..! ట్యాంకర్‌ బోల్తాపడి వాళ్లేడుస్తుంటే.. బిందేలు, బక్కెట్లతో పరిగెత్తిన ఊరోళ్లు
Tanker Accident
Jyothi Gadda
|

Updated on: Feb 07, 2024 | 1:21 PM

Share

రోడ్డు ప్రమాదాల ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుందో చెప్పలేం. ఇలాంటి ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సారి జరిగిన ప్రమాదంలో ప్రజలు, పాపం అనాల్సిందిపోయి ఏం చేశారో చూస్తే మీ తలను మీరే బాదుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ఇంధన ధరలతో సామాన్యుల వెన్ను విరుగుతోంది. ఇదిలా ఉంటే, లక్నోలో ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ప్రమాదం జరిగిన తర్వాత ప్రజలు ఏం చేశారనేది షాకింగ్. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇండ్ల నుంచి బకెట్లు, డబ్బాలతో ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారో వీడియోలో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

వీడియోలో మీరు చూడగలిగినట్లుగా, ట్యాంక్‌ చుట్టూ జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ట్యాంకర్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ లీక్‌ అవుతోంది. ఈ విషయం తెలియగానే ప్రజలు బిందేలు, బక్కెట్లు తెచ్చి నింపుకోవడం ప్రారంభించారు. కొందరి చేతిలో బాటిల్, మరికొందరు బకెట్ తెచ్చుకున్నారు. ఇంట్లో ఏది పడితే అది అది తెచ్చుకుని ఆయిల్‌ దోచుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రావటంతో తోపులాటకు దిగారు. లక్నోలో ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

పొరపాటున చిన్న నిప్పురవ్వ కూడా అందులో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. జనం దొంగతనం చేసి పారిపోతున్నారు. అనస్ ఘాజీ పేరుతో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వంతెనపై కూడా పెద్ద సంఖ్యలో జనం కనిపిస్తారు. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, వీడియోపై చాలా కామెంట్స్ వస్తున్నాయి. ప్రమాదాల సమయంలో ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…