Khammam: ఏ సౌకర్యాలు లేని ఏజెన్సీలో ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదేనా..?
మారుతున్న జీవన శైలి, ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి తన ఆరోగ్యం పై దృష్టి పెట్టలేక పోతున్నారు..దీనికి ప్రధాన కారణం ఆహార అలవాట్లు..మనం తీసుకునే ఆహారం ను బట్టే వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు..అయితే ఏ మాత్రం సౌకర్యాలు లేని ఏజెన్సీ లో ఆదివాసీలు మిగతా వారితో పోల్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నారు..
ఖమ్మం జిల్లా, ఫిబ్రవరి 07; భద్రాచలం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీల ఆరోగ్య అసలు రహస్యం తెలుసుకోవాలంటే వారి దగ్గరగా వెళ్లి చూడాల్సిందే..వేకువ జామునే సూర్య కిరణాలు రాకముందే అటవీ ప్రాంతానికి పరుగులు పెట్టి ఎండనక వాననక అటవీ జంతువులను సైతం లెక్కచేయకుండా అటవీ ఉత్పత్తులను సేకరించే పనిలో నిమగ్నమవుతారు ఈ ఆదివాసి బిడ్డలు.. నిత్యం ఇంత కష్టపడే వీరికి చిన్న దగ్గు జలుబు జ్వరం కాదు.. షుగర్ బీపీలు కూడా ఉండవు. ఎవరిని చూసినా సరే సిక్స్ ప్యాక్ బాడీ ఫిట్నెస్ తో కనిపిస్తుంటారు.. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలంతా కూడా సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు..
ఆహారంలో ముఖ్యంగా పండించిన వడ్లను నానబెట్టి వంట చెరకుతో కులాయిలో వేయించి అటుకులుగా చేసుకొని తింటుంటారు. ఎక్కువగా గర్భిణీలు అటుకులను తినడం వల్ల పోషకవిలువలతో పాటు నాణ్యమైన ఆహారం తీసుకోవడంతో గర్భిణీలు నార్మల్ డెలివరీ అవుతారని ఆదివాసీల నమ్మకం. అంతేకాదు పుట్టిన బిడ్డలకు కూడా చిన్న వయసు నుండే అటుకులను తినిపిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వయస్సుతో సంబంధం లేకుండా సకల రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగే ఈ రోజుల్లో చెట్లు కొండలపై ఎగిరి గంతులేసే మా ఆరోగ్య అసలు రహస్యమే అటుకులని ఎనలేని సంతోషంతో చెబుతున్నారు ఆదివాసీలు.
అడవిలో జీవించే ఆదివాసులు గర్భిణితో ఉన్న మహిళలు డెలివరీ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా తన పని తాను చేసుకుంటూ అటవీ ఉత్పత్తుల సేకరకు కూడా వెళ్తూ జీవనం గడపడమే కాకుండా పుట్టిన బిడ్డలకు సైతం బెల్లంతో నూరిన అటుకులను పెట్టి ఎటువంటి మందులు వాడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్నారు. అన్ని వయసుల వారు సైతం ఎటువంటి జబ్బులు లేకుండా జీవిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…