వామ్మో ఇదేం సాహసయాత్రరా దేవుడో..! లోకో పైలట్ ముందు వేలాడుతూ ప్రాణాంతక ప్రయాణం.. వీడియో వైరల్
రైలు నిండా ఎక్కిన ప్రజలు తలుపుల నుండి బయటకు వేలాడుతున్నారు. లోకో పైలట్ క్యాబిన్ లోపల, క్యాబిన్ బయట కూడా మనుషులు వేలాడుతున్నారు. దీంతో లోకో పైలట్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. తనతో పాటు ప్రయాణికుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసే ఈ తరహా వ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా, భారత రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే గమనించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. ఈ వీడియోను కొందరు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి ట్యాగ్ చేశారు.
ప్రయాణం అనేది సామాన్య ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. ప్రతి రోజూ ఉదయం లేచింది మొదలు ఏదో ఒక పనితో ప్రజలు ప్రయాణం చేస్తూనే ఉంటారు..అందులో కొందరు బస్సులు, రైళ్లు సొంత వాహనాలకు కూడా ఉపయోగిస్తారు. అలాంటి టైమ్‌లో రైలు మిస్ అయితే, ఆఫీస్‌కు ఆలస్యం అవుతుందేమోనన్న భయంతో ప్రయాణికులు వాహనాల వెనుక పరుగెత్తుకుంటూ వెళ్లే దృశ్యాలను కూడా మనం అనేకం చూస్తుంటాం..బస్సులు, రైళ్లలో కొంతమంది ఫుట్‌బోర్డ్‌పైనే ప్రయాణిస్తారు. ప్రస్తుతం, స్థానిక పర్యటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ప్రయాణీకులు ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ కనిపిస్తున్నారు. ఇందులో కొందరు రైలు ఇంజిన్ ముందు నిలబడడమే కాకుండా లోకో పైలట్ ముందు కూడా వేలాడుతున్నారు. ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌కు చెందినదిగా తెలిసింది.
ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లుగా, లోకల్ రైలు వేగంగా వెళుతోంది. ఆ ప్రాంతమంతా భారీ జనసందోహం కనిపిస్తోంది. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ నిలబడి తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. రైలు నిండా ఎక్కిన ప్రజలు తలుపుల నుండి బయటకు వేలాడుతున్నారు. లోకో పైలట్ క్యాబిన్ లోపల, క్యాబిన్ బయట కూడా మనుషులు వేలాడుతున్నారు. దీంతో లోకో పైలట్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. తనతో పాటు ప్రయాణికుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసే ఈ తరహా వ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా, భారత రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే గమనించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. ఈ వీడియోను కొందరు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి ట్యాగ్ చేశారు.
🇮🇳 West Bengal, South 24 Parganas, Sealdah-Magrahat local 🤲 pic.twitter.com/puezORI8iJ
— शून्य (@Shunyaa00) February 4, 2024
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈ వీడియోపై వినియోగదారులు స్పందిస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ…హమ్మయ్యా.. వారంతా బతికి బయటపడ్డారు…అది చాలు అన్నట్టుగా పేర్కొన్నారు. యమరాజు ఈ సమయంలో అయోధ్యలో ఉండి ఉంటాడు, అందుకే వారి ప్రాణాలు రక్షించబడ్డాయని రాశాడు. ఇలా చాలా మంది నెటిజన్లు చాలా రకాలుగా స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…