AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాఢ నిద్రలో ఉన్నవారిని గట్టిగా లేపటం ఎంత డేంజరో తెలుసా..? చనిపోయే ప్రమాదం ఉంది..!

దీనిని బ్రెయిన్ హెమరేజ్ అంటారు. కొన్నిసార్లు మెదడు చాలా తీవ్రంగా దెబ్బతింటుంది. అలాంటి పరిణామాల కారణంగా ఆ వ్యక్తి వికలాంగుడిగా మారటం లేదంటే చనిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువల్ల, ఎవరైనా గాఢ నిద్రలో ఉండగా మీరు వారిని అకస్మాత్తుగా లేపకూడదని చెబుతున్నారు. వారిని మెల్లగా కదిలించి లేపాలి. లేదంటే, కాస్త మీ స్వరం పెంచి పిలవటం మంచిదని సూచిస్తున్నారు.

గాఢ నిద్రలో ఉన్నవారిని గట్టిగా లేపటం ఎంత డేంజరో తెలుసా..? చనిపోయే ప్రమాదం ఉంది..!
Deep Sleep
Jyothi Gadda
|

Updated on: Feb 07, 2024 | 8:58 AM

Share

ప్రతి వ్యక్తి జీవితంలో నిద్ర అనేది ఒక ముఖ్యమైన భాగం. రోజంతా శ్రమించి అలసిపోయిన శరీరానికి నిద్ర తప్పనిసరి. నిద్ర అంటే.. శరీరంలోని కీలక అవయవాలకు కాసేపు విశ్రాంతిని ఇవ్వటం. నిద్ర ఒత్తిడి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. తర్వాతి రోజు కార్యకలాపాలకు శక్తిని పొందడానికి సహాయపడుతుంది. నిద్రలేమి వల్ల వచ్చే అలసట, బద్ధకం, మానసిక కల్లోలం దీర్ఘకాలంలో మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొందరికి నిద్రపోయే అవకాశం ఉన్నా.. సమయానికి పడుకోరు. మరికొందరు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా నిద్ర రాదు. అయితే, ఎవరైనా గాఢ నిద్రలోంచి అకస్మాత్తుగా మేల్కొన్నట్టయితే, అది అతని మెదడుకు శాశ్వత నష్టం కలిగిస్తుంది. దీంతో తీవ్రమైన మెదడు సమస్యలను తలెత్తుతాయి. దీనిని బ్రెయిన్‌ డ్యామేజ్‌ అని కూడా అంటారు. నిద్రలోంచి ఒక్కసారిగా ఎందుకు లేవకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

గాఢ నిద్రలోంచి అకస్మాత్తుగా మేల్కొనడం వారి ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చర్య వారి మానసిక సమతుల్యతను ప్రభావితం చేయడమే కాకుండా వారి జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం, అభిజ్ఞా అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలను కలిగిస్తుంది. నిజానికి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. నిద్రలో, మెదడు శరీర కణాలను సరిచేయడం, కొత్త జ్ఞాపకాలను నిల్వ చేయడం వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. మనం అకస్మాత్తుగా నిద్రలేచినట్లయితే, మెదడుపై ఒత్తిడి కలుగుతుంది. దాంతో అది పని చేయకుండా ఆగిపోతుంది.

మెదడుపై కలిగే ఒత్తిడి వల్ల మెదడులోని రక్తనాళాల్లో పగుళ్లు ఏర్పడి రక్తస్రావం మొదలవుతుంది. దీనిని బ్రెయిన్ హెమరేజ్ అంటారు. కొన్నిసార్లు మెదడు చాలా తీవ్రంగా దెబ్బతింటుంది. అలాంటి పరిణామాల కారణంగా ఆ వ్యక్తి వికలాంగుడిగా మారటం లేదంటే చనిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువల్ల, ఎవరైనా గాఢ నిద్రలో ఉండగా మీరు వారిని అకస్మాత్తుగా లేపకూడదని చెబుతున్నారు. వారిని మెల్లగా కదిలించి లేపాలి. లేదంటే, కాస్త మీ స్వరం పెంచి పిలవటం మంచిదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..