రంగు మారిన మిర్చి… ఇప్పుడు పసుపు రంగులో
సాధారణంగా కారం ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ప్రస్తుతం కారం రంగుకూడా మారబోతుందా అంటే అవుననిపిస్తోంది. అవును ఎండుమిర్చి రంగుమారాయి.. రంగుమారడమంటే నాసిరకం అనుకునేరు.. కానే కాదు.. వాటి సహజమైన కలరే పసుపు. ఈ పసుపురంగు మిర్చి ఖమ్మం మార్కెట్‌లో కనిపించాయి. మార్కెట్‌కు అమ్మకానికి ఓ రైతు తీసుకొచ్చాడు. వీటిని చూసి ఇతర రైతులు, వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సాధారణంగా కారం ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ప్రస్తుతం కారం రంగుకూడా మారబోతుందా అంటే అవుననిపిస్తోంది. అవును ఎండుమిర్చి రంగుమారాయి.. రంగుమారడమంటే నాసిరకం అనుకునేరు.. కానే కాదు.. వాటి సహజమైన కలరే పసుపు. ఈ పసుపురంగు మిర్చి ఖమ్మం మార్కెట్‌లో కనిపించాయి. మార్కెట్‌కు అమ్మకానికి ఓ రైతు తీసుకొచ్చాడు. వీటిని చూసి ఇతర రైతులు, వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కొత్తరకం మిర్చిని సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు ఎత్తి రాజాపురం గ్రామానికి చెందిన భూక్యా శ్రీను అనే రైతు పండించాడు. ఖమ్మం వ్యవసాయమార్కెట్‌కు ఈ కొత్తరకం మిచ్చి అమ్మకానికి తెచ్చాడు. సుమారు 10 బస్తాల ఎల్లో మిర్చి తీసుకొచ్చాడు. సహజంగా ఎరుపు రంగులో ఉండే మిర్చి పసుపు రంగులో ఉండటాన్ని చూసి రైతులు, హమాలీలు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ ఎల్లో గోల్డ్ మిచ్చి పంటకు డిమాండ్ ఎక్కువేనంటున్నాడు రైతు. ధరకూడా బాగానే పలుకుతుందని తెలిపారు. గతేడాది కూడా ఈ మిర్చి పండించాడు శ్రీను. అప్పుడు క్వింటా మిర్చి 35 వేల రూపాయలుపలుకగా ఈ ఏడాది కాస్త ధర తగ్గిందని పేర్కొన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ నిర్మాత నన్ను దారుణంగా మోసం చేశారు.. నిజాన్ని బయటపెట్టిన హీరోయిన్
మహేష్ Vs ధనుష్ రంజుగా స్టార్ హీరోల మధ్య పోరు
రాఖీ భాయ్ సినిమాలో షారుఖ్.. సిల్వర్ స్క్రీన్ భగ్గుమనుడే
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

