AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అత్తింటి వేధింపులకు అల్లుడు బలి..!

మెదక్ జిల్లా వెల్దుర్తిలో విషాదం చోటు చేసుకుంది. భార్య తరచూ వేరుగా కాపురం పెట్టాలని ఒత్తిడి చేయడం, అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన హరిప్రసాద్ (32) చికిత్స పొందుతూ మృతిచెందాడు. .. ..

Telangana: అత్తింటి వేధింపులకు అల్లుడు బలి..!
Hariparasad
P Shivteja
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 3:06 PM

Share

భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తింటి నుంచి వేధింపులు ఎదురవడంతో… ఆత్మ హత్యాయత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది..బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ (32)కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన పూజతో సుమారు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. అయితే వివాహం అయినప్పటినుంచి వేరు కాపురం పెట్టాలని భార్య, అత్తమామలు హరి ప్రసాద్‌పై ఒత్తిడి తెచ్చారు. కాగా ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు కావడంతో, తరచూ కూతురును తీసుకొని పూజ తన పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలోనే ఈ నెల 2న పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా .. అక్కడ అందరి ముందు తన కుమారుడిని దుర్భాషలాడి, విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలని తన కుమారుడ్ని రెచ్చగొట్టారని హరిప్రసాద్ తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.

పంచాయితీ అనంతరం పూజ కుమార్తెను తీసుకుని వెల్దుర్తిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్ర మంలో హరిప్రసాద్ ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తారింటిముందు పురుగులమందు తాగాడు. చుట్టుపక్కల వారి సాయంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. తన కుమారుడి మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్లతో పాటు బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కారణమంటూ మృతుడి తండ్రి మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us