Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nizamabad: ‘అమ్మకు అక్షరాభ్యాసం’ – తెలంగాణలో అద్భుత కార్యక్రమం

రాష్ట్రంలో తొలిసారిగా ‘అమ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన 42,749 మంది మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ కార్యక్రమ పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి..

Nizamabad: ‘అమ్మకు అక్షరాభ్యాసం’ - తెలంగాణలో అద్భుత కార్యక్రమం
Mothers Literacy Practice
Diwakar P
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 14, 2025 | 12:30 PM

Share

ఎక్కడైనా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించటం చూస్తాము. విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది అంటే దేవాలయాల్లో చిన్నారులకు పలకపై ఓనమాలు దిద్దించటం సహజంగా కనిపిస్తుంది. కానీ కామారెడ్డి జిల్లాలో ఇపుడు నిరక్షరాస్యులైన అమ్మలు పలకా బలపం పడుతున్నారు.శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మహిళా సంఘాల్లో పండగ వాతావరణంలో అమ్మకు అక్షరాభ్యాసం కార్యక్రమం ప్రారంభం అయింది. నిరక్ష్యరాస్యతను నిర్మూలించేందుకు అధికారులు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ వివరాలేంటో మీరూ చూడండి.

వందశాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తన చర్యల్ని వేగవంతం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారిగా కామారెడ్డి జిల్లాలో ‘అమ్మకు అక్షరాభ్యాసం’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. వయోజన విద్య విభాగానికి సంబంధించిన ‘అమ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమాలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నారు. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంకు అనుసంధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం వయోజన విద్యలో ఈ కార్యక్రమాలను చేపడుతోంది. అందుకోసం స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఉన్న నిరక్షరాష్యులైన మహిళలకు అదే గ్రూపులోని అక్షరాస్యత గల మహిళలచే ‘అమ్మకు అక్షరాభ్యాసం’ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంబించింది . ఈ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో ఉన్న 17,194 స్వయం సహాయక సంఘాల్లోని 42,749 నిరక్షరాష్యులైన మహిళలను అక్షరాస్యులుగా చేసే దిశగా కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్ రాజు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ఎం సురేందర్, ఇరత అధికారులు.. స్వయం సహాయక సంఘాలకు చెందిన సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జిల్లాలోని కొన్ని స్వయం సహాయక సంఘాల్లో నిరక్షరాస్య మహిళలకు చిన్నారులు ఓనమాలు దిద్దించారు. మరికొన్ని సంఘాలలో అధికారులు మహిళలకు అక్షరాలు నేర్పించారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు చెప్పారు. అటు నిరక్ష్యరాసులు అయిన మహిళలు ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి