School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో 2 రోజులు పాఠశాలలకు సెలవులు.. ఎందుకో తెలుసా..?
School Holiday: సాధారణంగా పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులకు పండగే. ప్రస్తుతం తెలంగాణలో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. వచ్చే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు రానున్నాయి. అయితే ఈనెల 22న తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. దీంతో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు రానున్నాయి..

పాఠశాలకు సెలవు అంటే విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. మార్చి మూడవ వారంలోకి అడుగుపెడుతున్న తరుణంలో భారతదేశం అంతటా విద్యార్థులు సెలవు రానుంది. అయితే ఈ సెలవు అనేది అన్ని రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. మరి ఏయే రాష్ట్రాల్లో శుక్రవారం పాఠశాలలకు సెలవు ఉండనుందో తెలుసుకుందాం..
రాజస్థాన్‌లో ముఖ్యమైన పండుగ అయిన శీతల అష్టమి పండుగ కారణంగా మార్చి 21న పాఠశాలలు మూసి ఉండనున్నాయి. అదే విధంగా పవిత్ర రంజాన్ మాసం 21న వచ్చే హజ్రత్ అలీ షహాదత్‌ను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ క్యాలెండర్ మార్చి 21న సెలవు దినంగా పేర్కొన్నప్పటికీ, దానిని మార్చి 22న మార్చింది. రంజాన్ ప్రారంభం సందర్భంగా నెలవంక కనిపించడం ఆలస్యం కావడం వల్ల తేదీలో మార్పు జరిగింది. అలాగే తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31, ఏప్రిల్ 1న రంజాన్ సెలవులు ఉన్నాయి. దీంతో తెలంగాణలో మార్చి 22న పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
నిజానికి కేవలం ఒక్కరోజు మాత్రమే స్కూళ్లకు సెలవు ఉంది. తర్వాత ఆదివారం వస్తుంది. దీంతో విద్యార్థులకు రెండు రోజుల పాటు సెలవు రానుంది. అయితే తెలంగాణలో షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా ఆప్షన్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం.. అన్ని పాఠశాలలకు సెలవు ఉండకపోవచ్చు. మైనార్టీ పాఠశాలలకు ఉండవచ్చు. అయితే తల్లిదండ్రులు మీ పిల్లలు చదివే పాఠశాలకు సెలవు ఇస్తున్నారా? లేదా అనేది తెలుసుకోండి.
అయితే, రాజస్థాన్ లో మాత్రం మార్చి 21న సెలవు ప్రకటించింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఈ రోజున పాఠశాలలు తెరిచే ఉంటాయి. ఉత్తర భారత రాష్ట్రాలన్నీ గణనీయమైన శీతాకాల విరామం తర్వాత ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు వేసవి సెలవులకు సిద్ధమవుతున్నాయి. ఇవి సాధారణంగా ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి