Google Pixel 9a: గూగుల్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. భారత్‌లో విడుదల.. ధర, ఫీచర్స్!
Google Pixel 9a: ప్రముఖ గూగుల్ కంపెనీ తన కొత్త గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. కొత్తగా ప్రారంభించిన Pixel 9a అనేది డ్యూయల్-సిమ్ (నానో+eSIM) హ్యాండ్‌సెట్. ఇది Android 15 పై రన్ అవుతుంది. దీనికి ఏడు సంవత్సరాల OS, భద్రతా అప్‌డేట్‌ను అందిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఇది 6.3-అంగుళాల (1,080×2,424 పిక్సెల్స్) ఆక్టా..

ప్రముఖ గూగుల్ కంపెనీ తన కొత్త గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. ఇది కంపెనీ మిడ్‌రేంజ్ “a” సిరీస్‌కి కొత్తగా అదనం. గత సంవత్సరం పిక్సెల్ 9 సిరీస్‌తో ప్రారంభించబడిన అదే టెన్సర్ G4 చిప్‌ను కలిగి ఉంది. ఇది 48-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. 5,100mAh బ్యాటరీని అందించింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
భారతదేశంలో Google Pixel 9a ధర:
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 9a ధర రూ. 49,999 ధరకు లభించే ఈ హ్యాండ్‌సెట్ 8GB + 256GB RAM స్టోరేజీ సామర్థ్యంతో ఒకే మోడల్‌లో లభిస్తుంది. పిక్సెల్ 9ఎ ఏప్రిల్‌లో భారతదేశంలో తన రిటైల్ భాగస్వాముల ద్వారా అమ్మకానికి వస్తుందని కంపెనీ తెలిపింది. అయితే హ్యాండ్‌సెట్ ఎప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉంటుందో ఇంకా ఖచ్చితమైన తేదీని ఇవ్వలేదు.
గూగుల్ పిక్సెల్ 9ఎ ఫీచర్లు:
కొత్తగా ప్రారంభించిన Pixel 9a అనేది డ్యూయల్-సిమ్ (నానో+eSIM) హ్యాండ్‌సెట్. ఇది Android 15 పై రన్ అవుతుంది. దీనికి ఏడు సంవత్సరాల OS, భద్రతా అప్‌డేట్‌ను అందిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఇది 6.3-అంగుళాల (1,080×2,424 పిక్సెల్స్) ఆక్టా (POLED) డిస్‌ప్లేను 60Hz, 120Hz మధ్య రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది.
Google Pixel 9a ఫోర్త్ జనరేషన్ టెన్సర్ G4 చిప్‌తో అమర్చి ఉంటుంది. ఇది Titan M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో జత చేసి ఉంటుంది. ఫోటోలు, వీడియోల కోసం Pixel 9a లో 1/2-అంగుళాల సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, క్లోజ్డ్-లూప్ ఆటోఫోకస్, f/1.7 ఎపర్చరుతో కూడిన 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. ఇది 8x వరకు సూపర్ రిజల్యూషన్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, f/2.2 ఎపర్చర్‌తో 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కూడా కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.2 ఎపర్చర్‌తో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించింది. ఇవే కాకుండా మరెన్నో ఫీచర్స్‌ను అందించినట్లు గూగుల్ తెలిపింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి