Air Cooler Tips: కూలర్లు కూడా పేలుతాయా..? ఈ పొరపాట్లు చేయకూడదంటున్న నిపుణులు!
Air Cooler Tips: ప్రతి సీజన్ ప్రారంభంలో కూలర్‌లను చెక్ చేసి వాడాలి. ఏదైనా పనిచేయకపోవడం లేదా ఏదైనా శబ్దం వస్తున్నట్లయితే దాన్ని సరి చేయాలి. టెక్నిషియన్‌ను పిలిపించి సరి చేయించాలి. ఈ జాగ్రత్తలను అనుసరించడం ద్వారా మీరు కూలర్ ప్రమాదం చాలా వరకు తగ్గించవచ్చు..
Updated on: Mar 20, 2025 | 1:07 PM

Air Cooler Tips: చాలా మంది ఇళ్లలో ఏసీలు, కూడార్లు ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటికి ఫుల్ గిరాకీ ఉంటుంది. ఎండా వేడిమి నుంచి తట్టుకునేందుకు చాలా మంది ఏసీలు, కూలర్ల ముందు వాలిపోతుంటారు. అయితే కూలర్లను ఎక్కువగా ఎండాకాలంలోనే ఉపయోగిస్తుంటాము. తర్వాత మూలన పెట్టేస్తుంటాము. సమ్మర్ సీజన్ రాగానే వాటి సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. అంటే వాటిని శుభ్రం చేయడం, అందులో ఉండే ప్యాడ్స్‌ను మార్చడం వంటివి చాలా ముఖ్యం. లేకుంటే దుమ్ము, ధూళి వల్ల ఎలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది.

అయితే ఏసీలలాగానే కూలర్‌లు కూడా పేలుడు జరుగుతాయా? ఏసీలు అంటే అందులో గ్యాస్‌తో కూడుకున్న కంప్రెసర్ ఉంటుంది కాబట్టి పేలి అవకాశాలు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. కానీ కూలర్లలో అలాంటిది ఉండదు. మరి కూలర్లు పేలుతాయని ఎందుకు అంటుంటారు నిపుణులు. ఇవి కూడా ప్రమాదకరమైనవి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు నిపుణులు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కూలర్లు పేలకుండా ఉంటాయంటున్నారు. మీరు కూడా ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటిస్తే మీ కూలర్ పేలిపోయే అవకాశాలు తగ్గుతాయి. అలాగే, దాని మరమ్మతు ఖర్చు కూడా ఉండదు. మీరు కూడా ఎయిర్ కూలర్‌ని ఉపయోగిస్తుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

నిజంగా కూలర్ పేలుతుందా?: ఏసీలలాగా కూలర్ పేలుతుందని భయాందోళన చెందుతుంటారు. ఏసీల వల్ల జరిగే ప్రమాదం కన్న కూలర్‌లలో చాలా తక్కువ. కానీ మీరు మీ కూలర్‌ను క్రమానుగతంగా శుభ్రం చేయకపోతే కూలర్ త్వరగా చెడిపోతుంది. దీని వల్ల కూలర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా పేలుడు సంభవించవచ్చు. అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నట్లు. పేలడం అంటే ఏదో బాంబు పేలినట్లు కాదు.

ప్రమాదం నుండి కూలర్‌ను ఎలా రక్షించాలి? : మీ కూలర్ సజావుగా నడవాలంటే మీరు క్రమం తప్పకుండా కూలర్‌ను శుభ్రం చేయాలి. ఇది కాకుండా కూలర్ నిర్వహణ కూడా చేయాలి. అలాగే కూలర్ కిట్, పంప్ క్రమానుగతంగా సర్వీస్ చేయాలి. మీరు ఇలా చేస్తే మీ కూలర్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉండదు.

ప్రతి సీజన్ ప్రారంభంలో కూలర్‌లను చెక్ చేసి వాడాలి. ఏదైనా పనిచేయకపోవడం లేదా ఏదైనా శబ్దం వస్తున్నట్లయితే దాన్ని సరి చేయాలి. టెక్నిషియన్‌ను పిలిపించి సరి చేయించాలి. ఈ జాగ్రత్తలను అనుసరించడం ద్వారా మీరు కూలర్ ప్రమాదం చాలా వరకు తగ్గించవచ్చు.





























