AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పోకిరీల వీరంగం.. కాబోయే భార్యతో మాట్లాడుతుండగా పిచ్చి పని.. ఆపై..!

హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్న యువతితో కారులో ప్రయాణిస్తున్న యువకుడిని ఐదుగురు అనుమానితులు వేధించారు. అసభ్యకరంగా ప్రవర్తించి, కారును ఢీకొట్టారు. యువకుడు తప్పించుకోవడానికి ప్రయత్నించగా, దుండగులు కారుపై ఎక్కి కారును ధ్వంసం చేశారు. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి ప్రమాదం జరిగింది. పోలీసులు మాత్రం ప్రమాదం కేసు నమోదు చేశారు.

Hyderabad: పోకిరీల వీరంగం.. కాబోయే భార్యతో మాట్లాడుతుండగా పిచ్చి పని.. ఆపై..!
Malakpet Crime
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Mar 20, 2025 | 4:27 PM

Share

హైదరాబాద్ మహానగరంలో పోకిరీలు రెచ్చిపోయారు. మద్యం మత్తులో చుక్కలు చూపించారు. కాబోయే భార్యతో మాట్లాడుతుండగా అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులు.. కారులో నుంచి యువతిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు వారి కారును వెంబడించి మరి వేధింపులకు గురిచేశారు. కారును ధ్యంసం చేయడమే కాకుండా వీరంగం సృష్టించారు యువకులు.

దాదాపు కిలోమీటర్ వరకు కారుపై యువకులు రణరంగం సృష్టించారు. ఎలాగైనా కాబోయే భార్యను కాపాడాలని తీవ్ర ప్రయత్నం.. వేగంగా కారు నడపడంతో ఒకరు కారు పై నుంచి దూకి పారిపోయాడు. మరోకడు అద్దంపై కూర్చోవడంతో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి ఆగిపోయింది. హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

హిల్స్ గ్రౌండ్ వద్ద హయత్ నగర్‌కు చెందిన వంశీ కృష్ణ అనే యువకుడు సైదాబాద్‌కు చెందిన తన కాబోయే భార్యతో కలసి మార్చి 18వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో కారులో మాట్లాడుతుండగా ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారు దగ్గరికి వచ్చి కారు అద్దాలు తీయాలని భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో వంశీ కృష్ణ కారును స్టార్ట్ చేసి వెళ్లే క్రమంలో కారుపై ఇద్దరు దుండగులు కూర్చుని కారు అద్దాలు పగలగొట్టారు. భయబ్రాంతులకు గురైన వంశీ కృష్ణ కొద్దీ దూరం అలాగే కారు ప్రయాణం చేశాడు. ఇంతలో కారుపై ఉన్న ఓ దుండగుడు దూకి పారిపోయాడు. మరోకడు కారు బానెట్ పై కూర్చోవడంతో ముందు ఏమి కనిపించకపోవడంతో రెండు ద్విచక్ర వాహనాలను డీ కొట్టాడు. బానెట్‌పై ఉన్న దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఇదిలావుంటే, ద్విచక్ర వాహనదారులు వంశీ కృష్ణను కొట్టి పోలీసులకు అప్పజెప్పారు. దీంతో పోలీసులు ఆక్సిడెంట్ కేసు నమోదు చేశారు. కానీ బాధితుడు రోడ్డు ప్రమాదం జరగడానికి కొందరు దుండగులు వెంబడించడమే ప్రధాన కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇదేం పట్టించుకోని పోలీసులు తనపై కేసు పెట్టి వేధిస్తున్నాడని వంశీ కృష్ణ ఆరోపిస్తున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, భయందోళనలకు గురించేసిన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు