TG SSC 2025 Exams: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకి కీలక సూచనలు ఇవే
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతికి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం 2650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 2,58,895 మంది అబ్బాయిలు, 2,50,508 మంది అమ్మాయిలు..
Vidyasagar Gunti | Edited By: Srilakshmi C
Updated on: Mar 20, 2025 | 8:00 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష లు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎగ్జామ్స్ కు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పూర్తి చేసేలా అన్ని చర్యలు విద్యాశాఖ తీసుకుంది. పరీక్షలు పూర్తయిన వెంటనే మూల్యాంకనం చేసేందుకు సైతం స్కూల్ ఎడ్యుకేషన్ సమాయత్తం అయింది. ఏప్రిల్ 4 న పరీక్షలు పూర్తి కాగానే స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు పేపర్స్ తరలిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతికి పరీక్షల కోసం 2650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 2,58,895 మంది అబ్బాయిలు, 2,50,508 మంది అమ్మాయిలు ఉన్నారు. పదో పరీక్షల నిర్వహణలో భాగంగా 2,650 మంది సీఎస్ లు, డీవోలను, 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇప్పటికే పాఠశాలల ద్వారా విద్యార్థులకు హాల్ టికెట్ల జారీ చేసిన ఎగ్జామినేషన్ విభాగం.. అందని స్టూడెంట్స్ నేరుగా వారి హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది.

ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థులు చివరి నిమిషంలో ఉరుకులు పరుగులు తీస్తుండడం మరి కొంతమంది పరీక్షలు మిస్ అవుతుండడంతో ఈసారి విద్యార్థులకు ఊరటనిచ్చింది స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం. ఈసారి నుంచి విద్యార్థులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్ష నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆలస్యంగా పరీక్షా కేంద్రానికివెళ్లి ఇబ్బంది పడటంకంటే.. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుంటే టెన్షన్ లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయవచ్చునని అధికారులు సూచిస్తున్నారు.

పరీక్ష కేంద్రాలకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు దాంతోపాటు పరీక్షా కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేదా ఇతరత్రా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ప్రతి పరీక్షా కేంద్రం చీఫ్ సూపర్డెంట్ ఆఫీస్ రూమ్ లో ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడ హైదరాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ లోని కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ గార్డెన్స్ తీసుకొని రావద్దని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రశ్న పత్రాలపై క్యూఆర్ కోడ్ తో పాటు సీరియల్ నెంబర్ను విద్యాశాఖ ముద్రించింది.

పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకొని రా వద్దని విద్యాశాఖ సూచించింద. విద్యార్థులు హాల్ టికెట్ పెన్, పెన్సిల్, పాడ్, ఎరేజర్, జమిట్రిక్ పరికరాలు మాత్రమే తీసుకొని రావాలి. పరీక్ష ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే ప్రతి పేపర్ పై విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. కానీ ఆన్సర్ షీట్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ షీట్ పై మాత్రం ఎలాంటి నెంబర్లు పేరు వివరాలు సంకేతాలు లాంటివి రాయొద్దని విద్యాశాఖ సూచించింది. పరీక్షా సమయం పూర్తయ్యే వరకు ఎగ్జామ్ హాల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.





























