Andhra Prades: చేపల విక్రయాలతో కళకళలాడుతున్న కాకినాడ ఫిషింగ్ హార్బర్..
కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో త్రాగునీటి సమస్యతో పాటు మరుగుదొడ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ఫిషింగ్ హార్బర్‌ని మరింత ఆధునీకరిస్తే మరిన్ని విక్రయాలు జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. చేపల వేలంపాటతో సందడి సందడిగా కనిపించే ఈ ఫిషింగ్ హార్బర్ పై స్థానిక ఎంపీతో పాటు స్థానిక జిల్లా కలెక్టర్ కూడా దృష్టి సారిస్తే మరింత వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు మత్స్యకారులు. ఫిషింగ్ హార్బర్ లో చేపలను కొనుగోలు చేసి కొంతమంది మార్కెట్‌కి వెళ్తుంటే మరి కొంతమంది గ్రామస్థాయిలో మహిళలు బుట్టలు చేతబట్టి చాపలను విక్రయిస్తు పొట్టకూటి కోసం కష్టపడుతూనే ఉంటారు.

కాకినాడ ఫిషింగ్ హార్బర్ లో త్రాగునీటి సమస్యతో పాటు మరుగుదొడ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. ఫిషింగ్ హార్బర్‌ని మరింత ఆధునీకరిస్తే మరిన్ని విక్రయాలు జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. చేపల వేలంపాటతో సందడి సందడిగా కనిపించే ఈ ఫిషింగ్ హార్బర్ పై స్థానిక ఎంపీతో పాటు స్థానిక జిల్లా కలెక్టర్ కూడా దృష్టి సారిస్తే మరింత వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు మత్స్యకారులు. ఫిషింగ్ హార్బర్ లో చేపలను కొనుగోలు చేసి కొంతమంది మార్కెట్‌కి వెళ్తుంటే మరి కొంతమంది గ్రామస్థాయిలో మహిళలు బుట్టలు చేతబట్టి చాపలను విక్రయిస్తు పొట్టకూటి కోసం కష్టపడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి గ్రామస్థాయిలో మనల్ని నిద్రలేపేది కూడా మత్స్యకార మహిళలే. ఫిషింగ్ హార్బర్ లో ఎండు చేపలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఉప్పు చేపలతో పాటు ఎండు చేపలకు ,ఎండు రొయ్యలకు ప్రత్యేకంగా కిలోల లెక్కన అమ్మకాలకి ఫిషింగ్ హార్బర్ లో పెడుతూ ఉంటారు. గుట్టలు గుట్టలుగా పోసి ఉన్న ఎండు చేపలకు ఇక్కడ ప్రత్యేక డిమాండ్ ఉంది. ఫిషింగ్ హార్బర్లో దొరకని చేపంటూ ఉండదు. ఇవి ప్రత్యేకంగా సముద్ర నడి మధ్యలో బోట్లలోనే ఆరబెట్టి ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చి మత్స్యకారుల విక్రయిస్తుంటారని చెబుతున్నారు.
కాకినాడ సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఫిషింగ్ హార్బర్లో భారీ చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ప్రత్యేక కార్గో సర్వీస్ కూడా కాకినాడ నుంచి పార్సిల్ రూపంలో వెళ్తాయి. టైగర్ సముద్రపు రొయ్యలకు కూడా ప్రత్యేక డిమాండ్ ఉంది. ప్రత్యేకమైన బోట్లలో విదేశాలకు కూడా చేపలను సరఫరా చేస్తుంటారు కాకినాడ మత్స్యకారులు. ఈ సముద్ర తీరంలో ఇప్పటికే ఉప్పాడ అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతుండగా… కాకినాడలో రెండు ఫిషింగ్ హార్బర్లలో జోరుగా ఉదయం సాయంత్రం చేపల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. బోటు మొత్తం నిండితే గాని మత్స్యకారులు సముద్ర తీర ప్రాంతం నుంచి ఫిషింగ్ హార్బర్ కు చేరుకోరు. కొంతమంది మార్కెట్లలో విక్రయించే వ్యాపారులు చేపలు దొరక్క అవస్థలు పడుతూ ఉంటారు. ఉదయం వచ్చి గంటల తరబడి తమకు కావలసిన చేపల కోసం ఎదురుచూసినప్పటికీ కొన్నిసార్లు వెనుతిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందంటున్నారు వ్యాపారులు.
ఏదేమైనప్పటికీ కాకినాడకు తలమానికంగా చేపల విక్రయాల వ్యాపారానికి మైలురాయిగా నిలుస్తోంది. కాకినాడ ఫిషింగ్ హార్బర్ అంటే ఇతర రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు పొంది రుచికి సుచికి పెట్టింది పేరు. కాకినాడ ఫిషింగ్ హార్బర్….. కాకినాడ చేపలు కావాలంటూ చాలామంది డిమాండ్ చేస్తూ ఉంటారు కూడా అలాంటి కాకినాడ ఫిషింగ్ హార్బర్ కు మరింత హంగులు దిద్ది నిత్యం సముద్రంలోనే వేట మీద ఆధారపడే మత్స్యకారులకు కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..