Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మానవత్వం చాటిన ఎంపీటీసీ.. పేదింటి గర్భిణీకి సీమంతం.. శభాష్ అంటున్న జనాలు..

Telangana: మనుషుల్లో దాతృత్వాన్ని కొదవ లేదు. తమ చుట్టూ ఉన్న నిరుపేదలకు అండగా ఉంటూ కొంత తమ దాతృత్వాన్ని చాటుకుంటారు.

Telangana: మానవత్వం చాటిన ఎంపీటీసీ.. పేదింటి గర్భిణీకి సీమంతం.. శభాష్ అంటున్న జనాలు..
Mptc
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 18, 2021 | 9:26 AM

Telangana: మనుషుల్లో దాతృత్వాన్ని కొదవ లేదు. తమ చుట్టూ ఉన్న నిరుపేదలకు అండగా ఉంటూ కొంత తమ దాతృత్వాన్ని చాటుకుంటారు. తాజాగా ఓ మహిళా ఎంపీటీసీ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. ఒక గర్భిణి స్త్రీని తన చర్యతో సంతోషపరిచారు. నిరుపేద గర్బిణికీ తన స్వంత ఖర్చులతో ఘనంగా సీమంతాన్ని నిర్వహించారు ఆ మహిళా ఎంపిటిసీ. తన పుట్టింటిని మరిపించేలా నిరుపేద గర్బిణికీ సీమంతం చేశారు. కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే కనిపించి, ఆ తరువాత కంటికి కనిపించని లీడర్లను చూసి ఉంటాము. కానీ ఈ ఎంపిటీసీ అలా కాదు. దళిత వాడలోనీ ఓ దళిత మహిళకు తన సొంత ఖర్చులతో ఘనంగా సీమంతం నిర్వహించి మానవత్వం చాటకున్నారు.

వివరాల్లోకెళితే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని దళితవాడలో ప్రసన్నలత అనే నిరుపేద గర్భిణీకీ స్థానిక ఎంపిటీసీ నూకల రాధిక సీమంతం వేడుకను నిర్వహించి, కన్నవారిని మరిపించారు. పేదింట్లో పుట్టటం వల్ల సీమంత వేడుకకు దూరమై వేదన చెందుతున్న ప్రసన్నలత కు తోబుట్టువుగా మారి ఆ ముచ్చట తీర్చారు. చేయి నిండుగా గాజులు తొడిగి, పసుపు, కుంకుమ, పూలూ, పండ్లు, చీర, సారే లతో సీమంతం నిర్వహించారు. సీమంతానికి వచ్చిన అతిధులకు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. రాధిక ఎంపిటీసీ గా ఎన్నికైన నాటి నుండి.. దళితవాడలో ఎన్నో ఏళ్ళగా ఉన్న సమస్యలను పరిష్కరించారు. ఏళ్ల తరబడి కరెంట్ లేకపోవడంతో ఆ సమస్యను కూడా తీర్చారు. దళితవాడలో కరెంట్ వెలుగులు నింపారు. తాజాగా అదే దళితవాడలో నిరుపేద గర్భిణీకీ సీమంతం నిర్వహించి పలువురిచేత శభాష్ అనిపించుకున్నారు.

Also read:

FASTAG Video: ఇకపై పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్‌..! పార్కింగ్ గేటు దగ్గర వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు..(వీడియో)

IPL 2021: రెడ్ టూ బ్లూ.. కొత్త లుక్‌లో ఆర్సీబీ.. కారణం ఏంటో తెలుసా.?(వీడియో)

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో దారుణం.. ఆస్తికోసం కొడుకులు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్ అవుతారు..!