TS Liquor Shop License: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వైన్స్, బార్ షాపుల లైసెన్స్ గడువు పొడిగింపు..!
TS Liquor Shop License: తెలంగాణ మద్యం షాపుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో దశ కరోనా మహమ్మారి కారణంగా వైన్స్ షాపులు మూత..
TS Liquor Shop License: తెలంగాణ మద్యం షాపుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో దశ కరోనా మహమ్మారి కారణంగా వైన్స్ షాపులు మూత పడటంతో లైసెన్స్‌లను నెల రోజుల పాటు పొడిగించింది ప్రభుత్వం. కరోనా కారణంగా మూతపడిన కారణంగా… బార్లు, వైన్స్‌ల లైసెన్సులను మరో నెల పాటు పొడిగించింది. అక్టోబర్ చివరినాటికి ముగియనున్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువును నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈనెల ఆఖరు వరకు బార్ల లైసెన్సుల గడువు ముగియనుండగా.. నెలరోజుల పొడిగింపుతో అక్టోబర్ 31 వరకు కొనసాగనున్నాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మద్యం దుకాణాలు, బార్లు మూతపడిన కారణంగా అదనంగా నెల పాటు పొడిగిస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు పేర్కొన్నారు.
అలాగే మార్జిన్ శాతాన్ని 6.4 నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్రంలో 2,200కుపైగా మద్యం షాపులు ఉన్నాయి. కరోనా కాలంలో నేపథ్యంలో బార్లకు ఆదాయం తగ్గడంతో ఒక నెల లైసెన్స్ ఫీజు రాయితీ కల్పించాలని నిర్ణయించింది. అయితే కరోనా సమయంలో తమకు నష్టం వాటిల్లిందని, ఇందుకు పరిహారంగా గడువు పొడిగించాలని వైన్స్‌షాపుల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో లైసెన్స్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, నవంబర్ 1 నుంచి రానున్న రెండేళ్ల కాలానికి కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చి లాటరీ ద్వారా కొత్తగా లైసెన్స్‌లు జారీ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.