chinna jeeyar swamy: శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్టకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులకు అందిన ఆహ్వానం(వీడియో)
సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ విగ్రహావిష్కరణకు రావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్ స్వామి. ఢిల్లీలో రాష్ట్రపతికి స్వయంగా ఆహ్వాన పత్రం అందజేశారు చినజీయర్...
శంషాబాద్ ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతా మూర్తి విగ్రహం ఏర్పాటు కాబోతోంది. 200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా రావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్ స్వామి. ఇదే వేదికపై శ్రీనివాస రామానుజం, మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు రాష్ర్టపతిని కలిశారు. విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించనున్నారు. యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : FASTAG Video: ఇకపై పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్..! పార్కింగ్ గేటు దగ్గర వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు..(వీడియో)
IPL 2021: రెడ్ టూ బ్లూ.. కొత్త లుక్‌లో ఆర్సీబీ.. కారణం ఏంటో తెలుసా.?(వీడియో)