Telangana: వెయ్యి మంది కార్యకర్తలతో బీఆర్‌ఎస్ అసంతృప్త ఎమ్మెల్యే బల పరీక్ష.. మంత్రి హరీష్ ఇంటికి
ఎమ్మెల్యే మదన్ రెడ్డి కే మళ్ళీ టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ పరిధిలోని 1000 మంది కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్ లోని మంత్రి నివాసానికి చేరుకొని మంత్రి హరీష్ రావుకి వినతిపత్రం సమర్పించారు. నర్సాపూర్ టికెట్ మళ్ళీ మదన్ రెడ్డికే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున్న హైదరాబాద్ వచ్చారు అని తెలుసుకొని ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారు...
నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది..సీఎం కేసీఆర్ మెదక్ టూర్ తర్వాత ఈ ఇష్యూ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కేసీఆర్ మెదక్ టూర్ ముగిసింది.. మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నియోజవర్గ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే టెన్షన్ నర్సాపూర్ బీఆర్ఎస్‌లో ఎక్కువ అవుతుంది. నర్సాపూర్ నియోజకవర్గ టికెట్ పంచాయతీ హైదరాబాద్‌లోని మంత్రి హరిష్ రావు వద్దకు చేరింది.
ఎమ్మెల్యే మదన్ రెడ్డి కే మళ్ళీ టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ పరిధిలోని 1000 మంది కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్ లోని మంత్రి నివాసానికి చేరుకొని మంత్రి హరీష్ రావుకి వినతిపత్రం సమర్పించారు. నర్సాపూర్ టికెట్ మళ్ళీ మదన్ రెడ్డికే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున్న హైదరాబాద్ వచ్చారు అని తెలుసుకొని ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మంత్రి హరీష్ రావుతో సమావేశం అయ్యి నర్సాపూర్ టికెట్ విషయం పై మాట్లాడారు. అయితే విషయాలన్నీ విన్న జిల్లా మంత్రి హరీష్ రావు కుడా విషయాన్ని కేసీర్ దగ్గరికి తీసుకోపాతానని హమీ ఇచ్చారు.
ఇదిల ఉంటే.. నిన్న సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనలో భాగంగా కూడా మదన్ రెడ్డి, సునీత లక్ష్మరెడ్డి అనుచరులు పోటాపోటీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇరు వర్గాలు పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పడే ప్రయత్నం చేశారు. నర్సాపూర్ మీదుగా మెదక్ వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ కి ఇరు వైపుల, మదన్ రెడ్డి వర్గీయలు చేతిలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఫ్లాకార్డ్ లోని పట్టుకొని సీఎం కేసీఆర్ దృష్టిలో పడే ప్రయత్నం చేశారు. మరో వైపు సీఎం కేసీఆర్ కూడా నర్సాపూర్ లో తన కాన్వాయ్ అపి ఎమ్మెల్యే మదన్ రెడ్డిని, సునీత లక్ష్మరెడ్డి ని తన బస్సులో ఎక్కించుకొని మెదక్ వెళ్లారు.
ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీత లక్ష్మరెడ్డి ఇద్దరితో సీఎం కేసీఆర్ బస్సులో.. మెదక్‌లో తాను పాల్గొన్న కార్యక్రమాల్లో పలుసార్లు మాట్లాడరని, మెదక్ బహిరంగ సభ వేదిక పై కూడా మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కొంత మంది నేతలు సీఎం కేసీఆర్ కి విజ్ఞప్తి చేశారని పొలిటిక్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. నర్సాపూర్ విషయంలో సునీత లక్ష్మారెడ్డి వర్గం కొంత తగ్గినట్లు ఉన్న.. ఎమ్మెల్యే మదన్ రెడ్డి వర్గం మాత్రం అసలు తగ్గడం లేదని సమాచారం.. మూడోసారి కూడా టికెట్ మదన్ రెడ్డికే ఇవ్వాలని గట్టిగా పట్టుపడుతున్నారని టాక్.
రాజీనామా చేస్తాం..
ఒకవేళ మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ఎంపీపీలు,జెడ్పిటిసిలు తమ పదవులకు రాజీనామా చేస్తామని ఇప్పటికే సంకేతాలు కూడా ఇస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే గత నాలుగు, ఐదు రోజులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. 2018లో సునీత లక్ష్మరెడ్డి కాంగ్రెస్స్ నుండి టిఆర్ఎస్ లోకి రాగానే..ఆమెకు క్యాబినెట్ హోదాలో ఉన్న పదవీ ఇచ్చారు అని, ఇప్పుడు మళ్లీ ఆమె ఎమ్మెల్యే టికెట్ అడగడం మంచి పద్ధతి కాదు అని.. ఎమ్మెల్యే మదన్ రెడ్డితో పాటు ఆయన అనుచరగనం వాదన.
ఒప్పుకునే ప్రసక్తే లేదు..
మొదటి నుంచి నర్సాపూర్ లొ పార్టీని కాపాడింది మదన్ రెడ్డి అని.. ఇప్పుడు అతనికి కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే వర్గం తేల్చి చెబుతోందని సమాచారం. దీంతో నర్సాపూర్ రాజకీయాలు రోజు రోజుకు హిట్ ఎక్కుతున్నాయి..టికెట్ కోసం సీఎం మెదక్ టూర్ లో ఆయన దృష్టిలో పడడానికి, నర్సాపూర్ నేతలు చేసిన హంగామా అంత ఇంత కాదు…చూడాలి మరి సీఎం కేసీఆర్ ఈ సారి ఎవరి వైపు మొగ్గు చూపుతారో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..