AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ9 వరుస కథనాలతో స్పందించిన అమెరికన్‌ కాన్సులేట్‌.. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు

అమెరికాలో మన విద్యార్థులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. దీంతో ఇది కాస్త సంచలనంగా మారింది. టీవీ9 వరుస కథనాలతో కాన్సులేట్‌ అధికారులు స్పందించారు. విద్యార్థులకు సాయం చేస్తామని అమెరికన్ కాన్సులేట్‌ భరోసా ఇచ్చింది. ఇందులో భాగంగానే 40 అమెరికన్‌ యూనివర్సిటీలతో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 26వ తేదీ (శనివారం) రోజు ఈ ఫెయిర్ ఉండనున్నట్లు అమెరికన్‌...

టీవీ9 వరుస కథనాలతో స్పందించిన అమెరికన్‌ కాన్సులేట్‌.. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు
Education USA
Narender Vaitla
|

Updated on: Aug 24, 2023 | 3:40 PM

Share

ఉన్నత చదువుల కోసం, తమ డాలర్‌ డ్రీమ్స్‌ను ఫుల్‌ ఫిల్‌ చేసుకునేందుకు అమెరికా వెళ్తున్న విద్యార్థులకు ఊహించని షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. కోటి ఆశలతో అమెరికాలో అడుగు పెట్టిన విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సరైన పత్రాలు లేవంటూ తిరిగి ఇండియాకు పంపించేసిన విషయం తెలిసిందే. దాదాపు 300 మందిని వర్సిటీల్లో చేరకముందే తిప్పి పంపేశారు. వీరిలో తెలుగు వారు కూడా చాలా మందే ఉన్నారు. దీంతో ఈ అంశంపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది.

అమెరికాలో మన విద్యార్థులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. దీంతో ఇది కాస్త సంచలనంగా మారింది. టీవీ9 వరుస కథనాలతో కాన్సులేట్‌ అధికారులు స్పందించారు. విద్యార్థులకు సాయం చేస్తామని అమెరికన్ కాన్సులేట్‌ భరోసా ఇచ్చింది. ఇందులో భాగంగానే 40 అమెరికన్‌ యూనివర్సిటీలతో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 26వ తేదీ (శనివారం) రోజు ఈ ఫెయిర్ ఉండనున్నట్లు అమెరికన్‌ కాన్సులేట్‌ తెలిపింది. అమెరికా కాన్సులేట్‌ అనుబంధ సంస్థ యూఎస్‌ఐఈఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఫెయిర్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉన్న సందేహాలను కాన్సులేట్ అధికారులు నివృత్తి చేయనున్నారు. ఏది మంచి యూనివర్సిటీ.. ఏది ఫేక్‌ అనే దానిపై.. విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరాలన్నీ ఇస్తామని కాన్సులేట్‌ టీమ్‌ చెప్తోంది. విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు హెల్ప్‌ డెస్క్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. హైటెక్‌సిటీలోని నోవాటెల్‌‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ జరగబోతోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫెయిర్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికా కాన్సులేట్ నిర్వహిస్తున్న ఈ యూనివర్సిటీ ఫెయిర్‌ హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోనూ నిర్వహించనున్నారు. ఆగస్టు 26న హైదరాబాద్‌లో నిర్వహిస్తుండగా సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు మొత్తం 8 నగరాల్లో ఈ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ముందుగా ఈ లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పేర్కొన్న సమచారాన్ని అందిచాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌లో జరిగే ఫెయిర్‌లో కింద పేర్కొన్న యూనిర్సీటీలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేస్తారు..

Usa

ఈవెంట్‌కు సంబంధించిన వివరాలు..

ఈవెంట్‌: 2023 ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ ‘స్టడీ ఇన్‌ ది యూఎస్‌’. యూనివర్సిటీ ఫెయిర్‌

తేదీ: ఆగస్టు 26, శనివారం

సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.

స్థలం: నోవాటెల్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.

రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..