Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: తూకం వేసినట్టు పదాలను ఉపయోగించే నిఖార్సైన రాజకీయవేత్తతో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ

ఈ రాజకీయ సంగ్రామంలో 400 ప్లస్ టార్గెట్‌తో వెళ్తున్న భారతీయ జనతా పార్టీకి.. తెలంగాణ నుంచి ఎంత షేర్ ఇవ్వబోతున్నారు? ఈసారి పదికిపైగా ఎంపీ సీట్లు సాధించాలనే లక్ష్యానికి ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు? ఈ నేపథ్యంలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌తో జరిగిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలకు సమాధానం ఇచ్చారు.

Follow us
Balaraju Goud

|

Updated on: May 10, 2024 | 8:40 PM

అతి తక్కువ కాలంలోనే జాతీయ స్థాయి నేతగా ఎదిగిన నాయకుడు.. గంగాపురం కిషన్‌ రెడ్డి. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ కొట్టి, మూడోసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్న కిషన్‌రెడ్డి.. లోక్‌సభలో అడుగుపెట్టిన తొలిసారే కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. ఓవైపు సెంట్రల్‌ మినిస్టర్ పదవి, మరోవైపు బీజేపీ స్టేట్‌ చీఫ్‌గా హోదా.. ఇలా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బూతులు మాట్లాడితేనే పొలిటికల్ లీడర్‌ అని అనుకుంటున్న ఈ రోజుల్లో.. తూకం వేసినట్టు పదాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించే నిఖార్సైన రాజకీయవేత్త. ఒక మాట తూలరు, ఒకరితో మాట పడరు.

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. సికింద్రాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పలు నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్‌షోలు, సభలతో హోరెత్తిస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈసారి ఎన్నికలను భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తరుణం.

ఈ రాజకీయ సంగ్రామంలో 400 ప్లస్ టార్గెట్‌తో వెళ్తున్న భారతీయ జనతా పార్టీకి.. తెలంగాణ నుంచి ఎంత షేర్ ఇవ్వబోతున్నారు? ఈసారి పదికిపైగా ఎంపీ సీట్లు సాధించాలనే లక్ష్యానికి ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు? ఈ నేపథ్యంలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌తో జరిగిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలకు సమాధానం ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..