Congress Manifesto: హైదరాబాద్‌కు జాతీయ సంస్థలు, పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే!

కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 హామీల మంత్రం ఫలించడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Congress Manifesto: హైదరాబాద్‌కు జాతీయ సంస్థలు, పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే!
Telangana Congress Manifesto
Follow us
Balaraju Goud

|

Updated on: May 03, 2024 | 1:28 PM

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పాలన గాడిలో పెట్టామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి. మొత్తంగా 23 ప్రధాన అంశాలతో కూడిన టీ. కాంగ్రెస్ మేనిఫెస్టోను దీపపాదాస్ మున్షి విడుదల చేశారు. రాహుల్ గాంధీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాయ్‌బరేలి వెళ్లిన కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొనలేదు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హామీలు ఇవే..

  • హైదరాబాద్ మహానగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్ట్ పునఃప్రారంభం
  • ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం అన్ని హామీ అమలు.
  • కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM)చ మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు
  • హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి వెంబడి రాపిడ్ రైల్వే సిస్టమ్ అభివృద్ధి.
  • ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణాలో విలీనం.
  • పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా.
  • హైదరాబాద్‌లో నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం.
  • నూతన ఎయిర్ పోర్టు ఏర్పాటు
  • రామగుండం-మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు.
  • నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు.
  • కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు. 10. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు
  • తెలంగాణలో జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు.
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) ఏర్పాటు
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (IIFT) ఏర్పాటు.
  • భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) క్యాంపస్ ఏర్పాటు.
  • నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు.
  • ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు.
  • కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ.
  • ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు.
  • హైదరాబాద్- బెంగళూరు మధ్య IT, ఇండస్ట్రియల్ కారిడార్ , హైదరాబాద్ – నాగపూర్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నుండి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు,
  • అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం.
  • మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు జాతీయ హోదా.
  • తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటు.
  • హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు

కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 హామీల మంత్రం ఫలించడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జాతీయ స్థాయిలో ‘న్యాయ్ పాత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. అలాగే రాష్ట్రాల వారీగా మేనిఫెస్టోలను రూపొందించింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోతో 23 హామీలను కాంగ్రెస్ విడుదల చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…