AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year Celebrations: మందుబాబులకు గుడ్ న్యూస్.. వైన్ షాప్స్, బార్లపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం..!

New Year Celebrations: నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ వేడులకు సంబంధించి మద్యం దుకాణాలు, బార్‌లు, పబ్‌లు,

New Year Celebrations: మందుబాబులకు గుడ్ న్యూస్.. వైన్ షాప్స్, బార్లపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం..!
Shiva Prajapati
|

Updated on: Dec 28, 2021 | 6:41 PM

Share

New Year Celebrations: నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ వేడులకు సంబంధించి మద్యం దుకాణాలు, బార్‌లు, పబ్‌లు, స్పెషల్ ఈవెంట్స్‌‌కు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31వ తేదీన మద్యం దుకాణాలకు అర్థరాత్రి 12 గంటల వరకు బార్‌లు, టూరిజం బార్‌లకు, స్పెషల్ ఈవెంట్స్‌ లకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, ఓవైపు కరోనా విజృంభిస్తున్న వేళ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తారని అంతా భావించారు. కానీ, ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు జరుగడం, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. మొన్నటి మొన్న కూడా ఒక ఓ మహిళ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలో మద్యం షాపులకు ఫ్రీడమ్ ఇవ్వడం విమర్శలకు దారి తీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు కూడా ఫైర్ అవుతున్నాయి. రాజకీయ సభలు, సమావేశాలకు అనుమతులు కోరితే కరోనా పేరుతో నిరాకరించిన ప్రభుత్వం.. ఇప్పుడెలా మద్యం దుకాణాలకు, బార్లకు, అనుమతులు జారీ చేశారంటూ నిప్పులు చెరుగుతున్నారు.

ఇదిలాఉంటే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. పోలీసులు సైతం ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డిసెంబర్ 31 రోజంతా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు.

Also read:

Tollywood : సినిమా టికెట్ల అంశం పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేంటంటే..

Upma: టిఫిన్‌గా ఉప్మా రవ్వ సూపర్.. 20 నిమిషాల్లో తయారు చేయవచ్చు..?

Sai Pallavi: థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసా.. ఆ సన్నివేశాలప్పుడు భయమేసిందన్న సాయిపల్లవి..