గేదెల గుంపుపై చిరుత దాడి.. ఆపై ఊహించని ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే.?
మహబూబ్‌నగర్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన చిరుత నడవలేక చతికిలపడి కనిపించింది. మొదట చిరుతను చూసి స్థానికులు..
మహబూబ్‌నగర్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన చిరుత నడవలేక చతికిలపడి కనిపించింది. మొదట చిరుతను చూసి స్థానికులు భయపడి పరుగులు పెట్టగా.. అది గాయపడిందని గమనించి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో దాన్ని బోనులోకి ఎక్కించారు. వైద్య చికిత్స కోసం జూకు తరలించారు.
కోయిల్ కొండ మండలం బురుగుపల్లి శివారులో గేదెల గుంపుపై దాడి చేసిన నేపధ్యంలో చిరుతపులి తీవ్రంగా గాయపడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. చిరుత కాలికి తీవ్ర గాయమై రక్తస్రావం అవుతోంది. మరోవైపు చిరుత దాడిలో గేదెలు కూడా గాయపడ్డాయి. తమపై దాడి చేయడానికి వచ్చిన చిరుతను గేదెలు కుమ్మేసినట్లు అధికారులు భావిస్తున్నారు. నడవలేని స్థితిలో కంటపడిన చిరుతపులికి గ్రామస్తులు నీళ్లు తాగించారు. అచ్చంపేట నుంచి వచ్చిన ప్రత్యేక బృందం చిరుతను బోనులో బంధించింది. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ లోని జూపార్కుకు చిరుతను పంపుతామని డీఎఫ్ఓ గంగిరెడ్డి తెలిపారు.
Also Read:
పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!
మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ రోగాలు రావొచ్చు!