Kothagudem: కొత్తగూడెంలో కదం తొక్కిన కామ్రేడ్లు.. బీజేపీని ఎదుర్కొనే సత్తా తమకే ఉందన్న కమ్యూనిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్ర జెండాలతో నిండిపోయింది. ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన ప్రజా గర్జన సభకు కదనోత్సాహంతో కదిలొచ్చారు కామ్రేడ్లు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉందని ప్రకటించారు ఎర్రన్నలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ప్రజాగర్జన సభ సాక్షిగా బీజేపీ విమర్శనాస్త్రాలు సందించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని..

Kothagudem: కొత్తగూడెంలో కదం తొక్కిన కామ్రేడ్లు.. బీజేపీని ఎదుర్కొనే సత్తా తమకే ఉందన్న కమ్యూనిస్టులు
Cpi Praja Garjana Sabha
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2023 | 7:00 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్ర జెండాలతో నిండిపోయింది. ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన ప్రజా గర్జన సభకు కదనోత్సాహంతో కదిలొచ్చారు కామ్రేడ్లు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉందని ప్రకటించారు ఎర్రన్నలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ప్రజాగర్జన సభ సాక్షిగా బీజేపీ విమర్శనాస్త్రాలు సందించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారన్న బండి సంజయ్‌ ఆరోపణలపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఎందులోనూ కమ్యూనిస్టులకు సాటిరాదన్న ఆయన.. ప్రపంచంలో ఎక్కడా ఎర్ర జెండా లేకుండా హక్కులు సాధించుకున్న చరిత్ర లేదన్నారు. నమ్మిన సిద్ధాంతాలను వదలని తమకు బీజేపీ నేతలు నీతులు చెబుతారా అంటూ మండిపడ్డారు. ఆ పార్టీ నేతల మాదిరిగా అధికారం కోసం అడ్డమైన గడ్డి తినడం లేదని విమర్శలు గుప్పించారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. ఎన్ని పర్యటనలు చేసినా వామపక్ష ఉద్యమాలకు పెట్టని కోటలాంటి తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఓట్ల పరంగా తమకు బలం తక్కువున్నా.. బీజేపీని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. దేశంలో మతం పేరుతో విచ్ఛిన్నశక్తిగా మారిన బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని నారాయణ పిలుపునిచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి తొత్తుగా పని చేస్తున్నాడని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్‌కి సీపీఐ నారాయణ సూటి ప్రశ్నలు సంధించారు. దళిత బంధు ప్రకటించారు, అది ఎంతమందికి వస్తుంది? అని నిలదీశారు. 3 ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చారో తేల్చాలని డిమాండ్ చేశారు. పొడు భూముల పరిస్థితి ఏంటి? పొడుభూముల సంఖ్య ఎంత? కాంట్రాక్టు కార్మికుల సమస్య ఎందుకు పరిష్కరించట్లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఈ ఏడాది ఏప్రిల్‌ 14న సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్రలు చేపట్టి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా కొత్తగూడెం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల కమ్యూనిస్టు శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..