Hyderabad: ఛీ.. ఛీ.. వాటితో ఐస్‌క్రీమ్స్ తయారుచేస్తున్నారా? హైదరాబాద్‌లో వెలుగు చూసిన మరో కల్తీ బాగోతం
హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్స్ వ్యవహారం మరవక ముందే.. మరో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. కల్తీ వ్యాపారం చేస్తూ దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు.
కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు సంపాదించడానికి ఎలాంటి నీచమైన పనులైనా చేస్తున్నారు కేటుగాళ్లు. తినే ఆహార పదార్థాలనుంచి ఐస్‌క్రీమ్స్, తాగే పాలు, స్వీట్లు ప్రతీది కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్స్ వ్యవహారం మరవక ముందే.. మరో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. కల్తీ వ్యాపారం చేస్తూ దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. చిన్న పిల్లలు తాగే పాల నుంచి ప్రతీ వస్తువును కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నకిలీ చాక్లెట్స్ ఘటన మరువక ముందే తాజాగా మరో బాగోతం వెలుగులోకి వచ్చింది. ఐస్ క్యూబ్ పేరిట సరూర్‌నగర్‌లో నడుస్తున్న అక్రమ దందాను బట్టబయలు చేశారు ఎస్‌ఓటీ పోలీసులు. కనీస శుభ్రత లేదు.. ఏమాత్రం నాణ్యత లేదు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు నిర్వాహకులు. ఐస్ క్రీమ్‌ల తయారీకోసం వాడుతున్న ముడిసరుకుల విషయంలోనూ.. నాణ్యత పాటించడంలేదు నిర్వాహకులు. కాలం చెల్లిన రసాయనాలను ఉపయోగిస్తూ.. జనం ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఏళ్ల క్రితమే ఎక్స్‌పైరీ అయిన రసాయనాలను వాడుతున్నారు నిర్వాహకులు. అక్కడి తయారీ విధానాన్ని చూసిన పోలీసులు షాక్అయ్యారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు, దోమలు ముసురుతున్న స్థలంలో ఐస్‌క్రీంలు తయారు చేస్తుండడంతో పోలీసులు విస్తుపోయారు.
మురుగు నీటి పక్కన రసాయనాలు, రంగునీళ్లు ఉపయోగించి ఐస్‌క్రీం తయారు చేస్తున్నట్లు గుర్తించిన SOT పోలీసులు చిన్న పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఐస్ క్యూబ్ ఓనర్ బిక్షపతిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ బ్రాండ్ల పేరుతో ఇష్టారీతిన లేబుళ్లు అతికించి మార్కెట్లోకి వదులుతున్న ఇలాంటి ఐస్‌క్రీంలు, చాక్లెట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి చర్యలు గమనిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి