KTR: బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేసీఆర్ రాజకీయాలను శాసించే రోజులు మళ్లీ వస్తాయి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దూకుడు పెంచింది. ఓ వైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాక్యలు చేశారు. పదేళ్ల నిజం కేసీఆర్, పదేళ్ల విషం బీజేపీ, వంద రోజుల అబద్ధం కాంగ్రెస్.. అంటూ విమర్శించారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దూకుడు పెంచింది. ఓ వైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాక్యలు చేశారు. పదేళ్ల నిజం కేసీఆర్, పదేళ్ల విషం బీజేపీ, వంద రోజుల అబద్ధం కాంగ్రెస్.. అంటూ విమర్శించారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుచేశారు. ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. పదేళ్ల నిజం కేసీఆర్, పదేళ్ల విషం బీజేపీ, వంద రోజుల అబద్ధం కాంగ్రెస్.. అని మోసాలతో గెలిచారంటూ విమర్శించారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే కాంగ్రెస్ హామీలు అమలవుతాయని.. కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను శాసించే రోజులు మళ్లీ వస్తాయని కేటీఆర్ చెప్పారు. సోమవారం కేటీఆర్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహించారు.
సిరిసిల్లలో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి కోట్లాది రూపాయలు వసూలు చేసిందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో గత పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని.. వ్యాపార వర్గాలకు రూ.14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బీజేపీకి సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 10 నుంచి 12 సీట్లలో గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..