Telangana: లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోమ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ.. పోస్టల్ బ్యాలెట్ మాత్రం కొంత మందకోడిగా సాగుతుంది. ఇక పోలింగ్ నిర్వహణ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తోంది ఎలక్షన్ కమిషన్. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామంటుంది. ఎన్నికల నిర్వహణలో మూడు లక్షల మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారని పేర్కొంది.

Telangana: లోక్ సభ ఎన్నికల్లో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ షురూ..
Vikas Raj
Follow us

| Edited By: Srikar T

Updated on: May 06, 2024 | 1:49 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోమ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ.. పోస్టల్ బ్యాలెట్ మాత్రం కొంత మందకోడిగా సాగుతుంది. ఇక పోలింగ్ నిర్వహణ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తోంది ఎలక్షన్ కమిషన్. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామంటుంది. ఎన్నికల నిర్వహణలో మూడు లక్షల మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారని పేర్కొంది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు దాదాపు 2,40,000 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా హోమ్ ఓటింగ్ వేయడానికి 24,000 మందికి పైగా అప్లై చేసుకుంటే 23 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. మరో వెయ్యి మందికి వివిధ కారణాలవల్ల రిజెక్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందో ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు సిఈఓ వికాస్ రాజ్. ఇందులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న విధానాన్ని పరిశీలించడానికి హైదరాబాద్ అబిడ్స్‎లో ఉన్న ఓ పాఠశాలలో ఫెసిలిటేషన్ సెంటర్స్‎ను సందర్శించి స్ట్రాంగ్ రూమ్, డేటా ఎంట్రీ, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చేశారని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగుల కోసం వారు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మే 3 నుండి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వారిగా ఈవీఎం రాండమైజేషన్ జరిగిందని, బ్యాలెట్ కమిషనింగ్ ప్రక్రియ మొదలు అయిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు త్రాగునీరు, షెడ్స్, మెడికల్ బృందాలు, షామియాన, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశించామన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఎవ్వరికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం వరకు హోమ్ ఓటింగ్ 50 శాతం కంటే ఎక్కువగా పూర్తయిందని తెలిపారు. ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి నుండి ఓటు వేసేందుకు ముందుకు రావాలని సూచించారు.

జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఫేసిలిటెషన్ సెంటర్లును ఏర్పాటు చేశారు. అదే విధంగా హోం ఓటింగ్ పక్రియా కూడా కొనసాగుతుందని ఇప్పటి వరకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ కూడా వినియోగిచుకుంట్లు తెలిపారు. హోమ్ ఓటింగ్‎లో ఆదివారం నాటికి 571 ఓటర్లకుగానూ 479 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచడానికి స్వీప్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించేందుకు విశేష కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల రోజు ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్‎లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఓటు ప్రజాస్వామ్యం మనుగడకి వారి వారి బాధ్యతను గుర్తు చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి అన్నారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రెండు లక్షల నలభై వేల మందికి పైగా అప్లై చేసుకుంటే ఆదివారం వరకు కేవలం 33,000 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరొక రెండు రోజులే సమయం ఉండడంతో ప్రతి ఒక్కరూ త్వరితగతిన వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక హోమ్ ఓటింగ్ మాత్రం 23,000 మంది ఓటర్లు ఉంటే 15,000 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తిస్థాయి ప్రక్రియ అయ్యే లోపు అటు పోస్టల్ బ్యాలెట్ ఇటు హోం ఓటింగ్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?