Kishan Reddy: బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. రేవంత్ మళ్లీ మోసం చేస్తున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్..

బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతల తీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్‌ఎస్‌ నేతలు ఇంకా జీర్జించుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కిషన్‌రెడ్డి. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి..మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. రేవంత్ మళ్లీ మోసం చేస్తున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్..
Telangana Politics
Follow us

|

Updated on: Apr 20, 2024 | 7:38 PM

బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతల తీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్‌ఎస్‌ నేతలు ఇంకా జీర్జించుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కిషన్‌రెడ్డి. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి..మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడిందని.. ఆ పార్టీ పని అయిపోయినట్టేనంటూ వ్యాఖ్యానించారు. గులాబీ పార్టీ ఓడిపోయి ఐదు నెలలు గడిచినా.. కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించలేదని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు పార్టీ ఓటమిని తట్టుకోలేక బీజేపీపై విమర్శలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో బీజేపీ అన్ని పార్టీల కంటే ముందుందని… అభ్యర్థులను కూడా అందరి కంటే ముందే ప్రకటించామని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని, ఎక్కువ స్థానాల్లో సీట్లను గెలుచుకుంటామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

గ్యారంటీల అమలు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు కిషన్‌రెడ్డి. గ్యారంటీల విషయంలో రేవంత్‌ అబద్ధాలు చెబుతున్నారు.. జూన్‌ 5 తర్వాత గ్యారంటీలు అమలు చేస్తారా..? కామారెడ్డిలో BRSను ఓడించింది బీజేపీనే అంటూ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..