Hyderabad: ఇప్పటివరకు గంజాయే అనుకున్నాం.. పోలీసుల తాజా తనిఖీల్లో షాకింగ్
ఇప్పటివరకు గంజాయి, డ్రగ్స్ పట్టుబడటం చూశాం. చాలాకాలం తర్వాత నగరంలో నల్లమందు రవాణా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో పరాస్ అనే ప్రధాన నిందితుడి ద్వారా నల్లమందు సిటీకి సరఫరా అవుతుందని పోలీసులు చెబుతున్నారు.
డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. స్మగ్లింగ్ రాయుళ్లు వెనక్కి తగ్గడం లేదు. గట్టుచప్పుడు కాకుండా ఇస్మార్ట్ పద్దతుల్లో వాటిని రవాణా చేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ ధూల్‌పేటలో 160 కేజీల నల్లమందును అధికారులు సీజ్ చేశారు. మత్తు మందును తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. గసగసాల పంటను పండించి.. వీటి ద్వారా హెరాయున్ డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. గత 15 రోజుల క్రితం నల్లమందు హైదరాబాద్‌కు సరఫరా అవుతుందనే ఇన్ఫర్మేషన్ తమకు వచ్చిందని.. పక్కాగా మాటు వేసి.. నిందితులు తేజ రామ్, దేవంద్ర కస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన నల్లమందు రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
ఇప్పటివరకు గంజాయి, డ్రగ్స్ పట్టుబడటం చూశాం. చాలాకాలం తర్వాత నగరంలో నల్లమందు రవాణా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో పరాస్ అనే ప్రధాన నిందితుడి ద్వారా నల్లమందు సిటీకి సరఫరా అవుతుందని పోలీసులు చెబుతున్నారు. 1 గ్రాము నల్ల మందు మార్కెట్లో 1000కి అమ్ముతున్నట్లు చెప్పారు. మెుత్తంగా 1.5 కోట్లు విలువ చేసే 160 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. గసగసాలు పంటను పండించి వీటి ద్వారా హెరాయిన్, మార్పిన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. నల్లమందు గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గసగసాల పంటను అనుమతి లేకుండా పండించడం నేరమని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..