Telangana: 65 ఏళ్ల వయసులో 40 జంటలు.. ఊరంతా కన్నుల పండుగలా జరిగిన వేడుక
ఏంటి ఇక్కడ.. వృద్ధ దంపతులు అందరూ ఒక చోటకు చేరారు. వివాహ మహోత్సవానికి హాజరయ్యారు అందుకే సందడిగా ఉందనుకుంటే మీరు పొరపడినట్టే. మరి ఏంటి అనుకుంటున్నారా. ఇది ఆదర్శ సమూహిక షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమం. ఇన్ని వృద్ధ జంటలకు ఒకేసారి షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమం ఇది ఎలా సాధ్యమైంది అనే కదా మీ ఆలోచన. తెలుసుకుందాం పదండి.

భగవంతుడికి.. భక్తుడికి అనుసంధానంగా ఉండే ఆ గ్రామ పురోహితుడికి (పూజారి) కి వచ్చిన ఆలోచన ఈ షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమం రూపకల్పనకు దారితీసింది. కార్తిక మాసం సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ పురోహితుడు. గ్రామం పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని దీవించే ఆ పూజారి ఈ మహతర కార్యక్రమం నిర్వహించడంతో ఆయనను ప్రతి ఒక్కరు అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆయన ఓ ఆలయ పూజారి 45 ఏళ్లుగా గ్రామంలో ఉంటూ నిత్యం రామాలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. అందరూ బాగుండాలి, పాడిపంటలతో గ్రామం కలకడలాడాలని కోరుకునే ఆ పూజారి గ్రామం కోసం తన వంతుగా ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో కార్తీక మాసం సందర్భంగా గ్రామంలో 40 మంది వృద్ధ జంటలకు షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమం నిర్వహించాలని తలచారు.
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ బంధం ఎంతో గొప్పగా ఉండాలని కోరుకుంటారు. ఆ వివాహాన్ని ఎంతో అంగు ఆర్భాటాలతో చేసుకున్నామో, షష్టిపూర్తి కూడా అలానే జరుపుకోవాలని అనుకుంటారు. నేటి రోజుల్లో ఇది సాధ్యం కావడం లేదు కుమారులు, కుమార్తెలు ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడటం, పేదరికంతో కందరు ఈ కార్యక్రమం చేసుకోలేక పోతున్నారు. పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున గ్రామంలో 40 జంటలకు తానే నిత్యం కొలిచే పూజించే రామాలయంలో ఆ వృధ జంటలకు తన సొంత ఖర్చులతో పూజారి షష్టిపూర్తి కార్యక్రమం మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేపట్టి ఆదర్శంగా నిలిచాడు.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడుకు చెందిన కాశవజ్జల పురుషోత్తం శాస్త్రి.. కార్తీక మాసం సంద ర్భంగా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో 65 ఏళ్లు నిండిన 40 జంటలకు సామూహిక షష్టి పూర్తి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రామాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితుడు కాశవజ్ఝల పురుషోత్తం శాస్త్రి తన సొంత ఖర్చులతో ఆ జంటలకు నూతన వస్త్రాలు, శాలువాలు, పూలదండలు తీసుకువచ్చి షష్టిపూర్తి చేయించారు.
వృద్ధ దంపతులతో ఒకరికొకరు దండలు మార్పించడంతో పాటు అనంతరం వారితో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం చేయించారు. పూజానంతరం 40 జంటలను పూజారి కాశవజ్ఝల పురుషోత్తం శాస్త్రి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గ్రామంలో వృద్ధ దంపతులను గుర్తించి వారికి సొంత ఖర్చులతో షష్టి పూర్తి చేయించిన పూజారి పురుషోత్తంశాస్త్రిని గ్రామస్థులు అభినందించారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
