AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చచ్చేంత భయం! మానసిక ఆరోగ్యంపై ఫోకస్ లేకనేనా ఈ ఫోబియాస్?

చిన్న చిన్న కారణాలతో చిన్నప్పటి నుంచే భయం పెంచుకుని చివరికి ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. లేటెస్టుగా చీమల భయంతో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటే, రాబిస్ రాబోతుందనే భయంలో ఆమధ్య మరొకరు, పిల్లలకు చదువు రాదేమో అనే భయంతో ఇటీవల ఓ కుటుంబం ఇలా అనేక ఆత్మహత్యలు. పెరుగుతున్న ఒత్తిడి ఓపక్క... అనేక రకాలైన అపోహలు, భయాలు మరోపక్క ఈ ఆత్మహత్యలకు పురిగొల్పుతుంటే, మరో వైపు జీవించే ధైర్యం లేక బలవన్మరణానికి పాల్పడే వాళ్ళు మరికొందరు. ఇక చదువులతో ఒత్తిడితో చనిపోయే వారి సంగతి సరే సరి. ఈ అర్ధాంతర చావులకు కారణం మన దేశంలో మానసిక ఆరోగ్యంపై ఫోకస్ లేకపోవడమే! సైకాలజిస్టులకు, సైకియాట్రిస్టులకు చూపించుకుంటే మానసిక రోగి అనే ముద్ర వేస్తారనే భయం వల్లే అనేకమంది కౌన్సిలింగ్‌కు పోవడంలేదు!

Telangana: చచ్చేంత భయం! మానసిక ఆరోగ్యంపై ఫోకస్ లేకనేనా ఈ ఫోబియాస్?
Mental Health Awareness
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2025 | 9:30 PM

Share

సంగారెడ్డిలో మనీషా. మహబూబ్‌నగర్‌లో యశోదా. ఆరబెట్టిన పల్లీలను కుక్క ఎంగిలి చేసిందని, ఇక రేబిస్ కన్ఫామ్ అని భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఒంటరిగా చనిపోలేదు. మూడేళ్ల కూతురిని చంపి సూసైడ్ చేసుకుంది. ఇంటిళ్లిపాదికి రేబిస్ వ్యాక్సిన్ వేయించినా సరే.. ఆమె మానసిక స్థితి అంగీకరించలేకపోయింది. ఒక్కోసారి చుట్టుపక్కల వారికి కనిపించకపోవచ్చు గానీ.. ఇలాంటి భయాలతో మన ఇళ్ల మధ్యే ఉండేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఒక్కసారి ఆ డేటా తెలుసుకుందాం…  హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కి రోజుకు 540 మంది పేషెంట్స్ వస్తుంటారు. అందులో పాతవాళ్లున్నారు, కొత్తవాళ్లూ ఉన్నారు. ఆందోళన కలిగించే మ్యాటర్ ఏంటంటే.. వీరిలో 35 శాతం మంది బాధితులు 18 నుంచి 30 ఏళ్లలోపు వారే! గ్రేట్‌గా ఫీల్ అవాల్సిన అంశం ఏంటంటే.. ఎవరేమనుకుంటారోనన్న భయం వీడి ముందుకొస్తున్నారు. హ్యాట్సాఫ్. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ సర్వే చేసింది. ఈ భూమ్మీద దాదాపు వంద కోట్ల మందికి పైగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని తేల్చింది. అంటే.. ప్రపంచ జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరు డిప్రెషన్‌తోనే ఉన్నారు. ప్రతి 100 మరణాల్లో ఒకటి మానసిక సమస్యల కారణంగా జరుగుతున్న ఆత్మహత్యే. ఇండియాలో పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. భారత్‌లో 15 కోట్ల మందికి మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలు అవసరం అని ఓ రిపోర్ట్ తేల్చింది. 15 కోట్ల మందికి మెంటల్ హెల్త్ అవసరం ఉన్నప్పటికీ… కేవలం 2 కోట్ల మంది మాత్రమే...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం