AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై గూగుల్‌ మ్యాప్స్‌లో కూడా టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు! ప్రాసెస్‌ ఇదే..

గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లు నేరుగా బుక్ చేసుకోవచ్చు. మీరు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రూట్ వెతుకుతున్నప్పుడు, అందుబాటులో ఉన్న బస్సుల వివరాలు కనిపిస్తాయి. మీకు నచ్చిన బస్సును ఎంచుకుని, ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు.

RTC ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై గూగుల్‌ మ్యాప్స్‌లో కూడా టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు! ప్రాసెస్‌ ఇదే..
Google Maps And Apsrtc
SN Pasha
|

Updated on: Nov 08, 2025 | 7:00 AM

Share

సాధారణంగా మనం గూగుల్‌ మ్యాప్స్‌ను రూట్‌ తెలుసుకునేందుకు వాడుతుంటాం. అయితే ఇప్పుడు అందులోంచి టిక్కెట్‌ కూడా బుక్‌ చేసుకోవచ్చని తెలుసా? ఎస్‌.. ఇది నిజం. గూగుల్‌ మ్యాప్స్‌లో ఓ ప్లేస్‌ నుంచి మరో ప్లేస్‌కు వెళ్లేందుకు సెర్చ్‌ చేస్తే.. ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న బస్సుల వివరాలు కనిపిస్తాయి. అందులో మీకు కావాల్సిన బస్సును ఎంచుకొని టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ పలు వివరాలను గూగుల్‌కు అందజేసింది. ఇప్పటికే ఆర్టీసీలో బస్టాండ్లలోని కౌంటర్లు, ఏజెంట్లు, వెబ్‌సైట్, యాప్‌లో రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఇప్పుడు కొత్తగా గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా కూడా రిజర్వేషన్‌ చేసుకోవచ్చు.

ఎలా చేసుకోవాలి..?

గూగుల్‌ మ్యాప్స్‌లో విజయవాడ నుంచి హైదరాబాద్‌ అని టైప్‌ చేస్తే.. వీటి మధ్య దూరం ఎంత, బైక్, కారు, బస్, రైళ్లలో ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందనే వివరాలు జనరల్‌ ట్రాన్సిట్‌ స్పీడ్‌ స్పెసిఫికేషన్‌ (జీటీఎస్‌ఎఫ్‌) ద్వారా కనిపిస్తాయి. అందులో బస్‌ సింబల్‌ ఉన్నచోట క్లిక్‌ చేస్తే విజయవాడ నుంచి హైదరాబాద్‌కి ఎన్ని ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి, అవి ఏ సమయాల్లో బయలుదేరతాయి? ఎన్ని గంటల్లో చేరుకుంటాయనే వివరాలు కనిపిస్తాయి. మీకు అనుకూలమైన సమయానికి ఉన్న బస్సుపై క్లిక్‌ చేస్తే నేరుగా ఆర్టీసీ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా పేమెంట్‌ చేయవచ్చు.

ఆర్టీసీ అధికారులు, గూగుల్‌ ప్రతినిధులతో చర్చించి ప్రయోగాత్మకంగా విజయవాడ- హైదరాబాద్‌ మార్గంలో దీనిని అమలు చేశారు. కొద్ది రోజులపాటు దీనిని పరిశీలించగా విజయవంతంగా బుకింగ్స్‌ జరిగాయి. ఇదంతా మూడు నెలల కిందట పూర్తయింది. దీంతో ఆర్టీసీ రిజర్వేషన్‌ సదుపాయమున్న ఏసీ, సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ సర్వీసులు ఏయే రూట్లలో తిరుగుతాయో వాటి వివరాలను గూగుల్‌కు అందజేశారు. గూగుల్‌ ఆయా రూట్లలో బస్టాప్‌ల వారీగా లాటిట్యూడ్, లాంగిట్యూడ్‌ వంటివన్నీ ఆడిట్‌ టెస్ట్‌ జరిపి, మూడు రోజుల కిందట ఆమోదం తెలిపింది. వారంలో అన్ని రూట్లలో గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా బస్‌ టికెట్ల బుకింగ్‌కు అవకాశం కల్పించనున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!