Congress Meeting: ఖమ్మం కాంగ్రెస్ సభలో ఆరుగురికే ప్రసంగించే అవకాశం.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..?
Khammam Congress Meeting: ఖమ్మం వేదికగా ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఈ సభకు రాహుల్ గాంధీతో పాటు ఠాక్రే హజరుకానున్నారు. పొంగులేటితో పాటు పలువురు ముఖ్యలు హస్తం గూటికి చేరనున్నారు. ఇదే వేదికగా పాదయాత్ర ముగింపు సందర్భంగా భట్టి విక్రమార్కకు సన్మానం జరగనుంది.

Khammam Congress Meeting: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మరికొన్ని నెలల్లో మొదలుకానుంది. దీంతో పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. అంతేకాకుండా ఎవరికి వారిగా గెలిచే అభ్యర్థులపై దృష్టిపెట్టాయి. ఇక ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.. గతానికి భిన్నంగా ముందడుగు వేస్తోంది. ఇప్పటికే కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేలా ప్లాన్ వేసి.. సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లి చేరికతో పాటు.. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా.. ఇవాళ ఖమ్మం వేదికగా భారీ సభను తలపెట్టింది. ఇదే వేదిక నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనికోసం ఫుల్ స్ట్రాటెజీతో ముందుకు వెళ్తోంది. ఈ సభలో కేవలం ఆరుగురు నేతలకు మాత్రమే ప్రసంగించే అవకాశం లభించనుంది. రాహుల్ గాంధీ తోపాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుకా చౌదరి మాత్రమే ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సభలో రాహుల్ గాంధీ ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా ప్రవేశపెడతారని.. పలు హామీలు సైతం ఇస్తారని పేర్కొంటున్నారు.
రాహుల్ షెడ్యుల్ ఇదే..
ఖమ్మం సభకోసం రాహుల్ గాంధీ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు రానున్నారు. ఆ తర్వాత హెలికాఫ్టర్ లో సాయంత్రం 5.20 కి ఖమ్మం రానున్నారు. గంటన్నర పాటు సభా వేదికపై రాహుల్ గాంధీ ఉంటారు. సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా రాహుల్ గన్నవరం చేరుకోనున్నారు.
భారీ ఏర్పాట్లు..
ఖమ్మంలోని SR గార్డెన్స్ వెనక ప్రాంతంలో ఈ సభ జరగనుంది. దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు. 55 అడుగుల ఎత్తు..144 అడుగుల పొడవు.. 60 అడుగుల వెడల్పు.. ఏకంగా 200 మంది కూర్చొనేలా సభా వేదికను ఏర్పాటు చేశారు. ఇంకా.. 40 అడుగుల ఎత్తులో డిజిటల్ స్క్రీన్ ను సైతం ఏర్పాట్లు చేశారు. భట్టి పాదయాత్ర ముగింపు సభ.. కాంగ్రెస్ లో పొంగులేటి చేరనున్న నేపథ్యంలో ఖమ్మం మొత్తం కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు, కటౌట్లతో కళకళలాడుతోంది. మాజీ ఎంపీ పొంగులేటితోపాటు.. చాలామంది నాయకులు హస్తం కండువా కప్పుకోనున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..