AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: ‘నా ఆనవాళ్లను తీసేయడం ఎవరి వల్లా కాదు’.. కేసీఆర్‌ ఇంటర్వ్యూ హైలెట్స్

సారొచ్చారొచ్చారు.12 ఏళ్ల తరువాత మళ్లీ టీవీ9 లైవ్‌ షోలో పాల్గొన్నారు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌. చరిత్రను చెరిపివేయడం ఎవరి తరం కాదన్నారు. కేసీఆర్‌ అంటే హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ అన్నారాయన. కాళేశ్వరం మొదలు రాజకీయ ప్రకంపనలు రేపిన లిక్కర్‌ స్కామ్‌ వరకు కీలక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్‌, బీజేపీలపై తన స్టయిల్‌లో విమర్శలు సంధించారాయన. కేసీఆర్‌తో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ ఎక్స్‌క్లూజివ్‌ లైవ్‌ షో.. తెలుగు మీడియా చరిత్రలో మరో హిస్టరీ మార్క్‌ను క్రియేట్‌ చేసింది.

KCR: 'నా ఆనవాళ్లను తీసేయడం ఎవరి వల్లా కాదు'.. కేసీఆర్‌ ఇంటర్వ్యూ హైలెట్స్
KCR Interview
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2024 | 8:56 AM

Share

60 యేండ్ల  ఒడవని దు:ఖానికి తెరదించుతూ  జూన్‌ 2..2014న  తెలంగాణ ఆవిర్భావం.. గోల్కొండ ఖిల్లాపై   తెలంగాణ ఆత్మగౌరవ రెపరెపలు.   ప్రపంచ  ఉద్యమ చరిత్రలోనే తెలంగాణ మహోద్యమం ఓ మైలు రాయిగా నిలిస్తే  సాధికార తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ సరికొత్త చరిత్రకు తోవ తీశారు. పదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాలు అమలు చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయతో  అపర భగీరథుడిగా అభినందనలు అందుకున్నారు.  రాష్ట్రాల హక్కుల కోసం నినదించారు. రాష్ట్రాల పైన కేంద్ర ప్రభుత్వ ఆజామాయిషీని తగ్గించేలా రాజ్యాంగంలో మార్పు రావాల్సిన తేవాల్సిన అసవరం వుందన్నారు. ఆ దిశగా జాతీయ స్థాయిలో రాజకీయ మద్దతుకు ప్రయత్నించారు.  2023 ఎన్నికల్లో  తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో బీఆర్‌ఎస్‌ ప్రస్థానం ప్రగతి పథం నుంచి ప్రతిపక్షానికి మారింది. కొత్త ప్రభుత్వం కుదటపడే  వరకు సంయమనం పాటిస్తామన్నారు. వంద రోజుల తరువాత రైతుల సమస్యలపై గళమెత్తారు కేసీఆర్‌.

నాడు ఉద్యమ నేత హోదాలో టీవీ9 వేదికగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై సందేశం ఇచ్చారు కేసీఆర్‌. మళ్లీ  12 ఏళ్ల తరువాత ప్రతిపక్ష నేతగా  టీవీ9  డిబెట్‌లో  తాజా రాజకీయాలు, భవిష్యత్‌ పరిణామాలపై  తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తెలంగాణ అంటే కేసీఆర్‌.. కేసీఆర్‌ అంటే  తెలంగాణ.. ఇది ఒకప్పుడు బ్రాండ్‌. అయితే ఇప్పటికీ, ఎప్పటికీ తెలంగాణ నుంచి తన ఆనవాళ్లను తీసేయడం ఎవరి వల్లా కాదంటున్నారు కేసీఆర్.

సారు- కారు – పదహారు… గత పార్లమెంట్‌ ఎన్నికల్లో గులాబీదళం నినాదం. ఈసారి  డబుల్‌ డిజిట్‌ దక్కా అని  బీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. బీఆర్‌ఎస్‌కు సింగిల్‌ డిజిట్‌ కూడా రాదని కాంగ్రెస్‌.బీజేపీ విమర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఔర్‌ ఏక్‌ దక్కా అంటూ  మరోసారి పిడికిలి బిగించారు కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్టు..కరెంట్‌ కోతలు.. రైతుల సమస్యలు సహా తాజా రాజకీయాలపైన  టీవీ9 బిగ్‌ డిబెట్‌ వేదికగా తన వాణీ బాణీ  విన్పించారు కేసీఆర్‌.  బజారు భాష మాట్లాడటం వేరు..ప్రభుత్వాన్ని నడపడం  వేరు. బట్టకాల్చి మీద వేయాలని చూస్తున్నారంటూ  తన స్టయిల్‌లో  అధికారపక్షం వైఖరిని ఎండగట్టారు కేసీఆర్‌. అభిమానించే వాళ్లు..విమర్శించే వాళ్లు సహా ఇటు తెలంగాణ అటు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజానీకం టీవీ9ను వీక్షించారు.కేసీఆర్‌తో  టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్  లైవ్‌  షో గడప గడపలో మార్మోగింది. విమర్శలకు బదులు ఇవ్వడమే కాకుండా..కరెంట్‌ వెలుగు నుంచి కంటి వెలుగుల దాక  తెలంగాణపై తన విజన్‌ను వివరించారు కేసీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..