AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KA Paul in Munugode: సైకిల్ మీద సవారీ.. చేలో పత్తి ఏరుతూ.. ఓట్ల కోసం కేఎల్ పాల్ కొత్త అవతారాల్లో ‘విచిత్ర’ ప్రచారం

అన్ని పార్టీల అభ్యర్థుల ప్రచారం ఒక ఎత్తైతే ప్రజాశాంతి పార్టీ అధినేత, మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ తరపున పోటీచేస్తున్న కేఏ.పాల్ కూడా మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొత్త కొత్త హామీలతో ప్రజలందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

KA Paul in Munugode: సైకిల్ మీద సవారీ.. చేలో పత్తి ఏరుతూ.. ఓట్ల కోసం కేఎల్ పాల్ కొత్త అవతారాల్లో ‘విచిత్ర’ ప్రచారం
Ka Paul In Munugode
Surya Kala
|

Updated on: Oct 31, 2022 | 11:38 AM

Share

తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా.. దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించిన మునుగోడు ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నిక పోలింగ్ సమీపిస్తుండటం, ప్రచారానికి సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీలు ప్రచారా వేగాన్ని పెంచాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ, తెలంగాణ జనసమితి, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు సైతం ప్రచారంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రధాన పార్టీలకు ధీటుగా నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ.. ఓట్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అన్ని పార్టీల అభ్యర్థుల ప్రచారం ఒక ఎత్తైతే ప్రజాశాంతి పార్టీ అధినేత, మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ తరపున పోటీచేస్తున్న కేఏ.పాల్ కూడా మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కొత్త కొత్త హామీలతో ప్రజలందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన సంభాషణతో ప్రచారంలో నవ్వులు పూయిస్తున్నారు. ప్రజలు మాత్రం కేఏ.పాల్ చెబుతున్నవి వింటూనే.. మధ్య మధ్యలో సెటైర్లు కూడా వేస్తున్నారు.

అయితే సెటైర్లకు కూడా కేఏ.పాల్ సమాధానమిస్తున్నారు. తన ప్రచారంలో నేరుగా తెలంగాణ సీఏం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ టార్గెట్ గా ప్రచారం చేస్తున్నారు. ఒకో సారి కేంద్రమంత్రులంతా తన శిష్యులేనని, తన అభిమానులని చెబుతూనే.. మరో వైపు తెలంగాణకు సీఏంను, దేశానికి తానే ప్రధానమంత్రిని అవుతానంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేఏ.పాల్ ప్రచారం సందర్భంగా నిర్వహిస్తున్న రోడ్ షోలలో కూడా జన సందోహం కనిపిస్తోంది. ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్య కొనసాగుతున్నప్పటికి, బీఎస్పీ చెప్పుకోదగ్గ స్థాయిలో మునుగోడులో కొన్ని వర్గాల ఓట్లను పొందే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే కేఏ.పాల్ మాత్రం విజయం తనదేనని, తాను కాబోయే ఎమ్మెల్యేనంటూ ప్రచారంలో నవ్వులు పూయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డ్యాన్స్ చేస్తూ 

మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో డాన్స్ చేస్తూ స్టెప్పులేసిన కె ఏ పాల్, రోజుకో రకమైన గెటప్లో చిత్రవిచిత్రంగా ప్రచారం చేస్తూ కాబోయే సీఎం తానేనంటూ ప్రజలకు చెబుతున్నారు. మొన్నటికి మొన్న చెప్పులు కుడుతూ కనిపించిన కేఏ పాల్, తాజాగా రైతు వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. తలకు కండువా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకొని, రైతులతో కలిసి కాసేపు ముచ్చటించారు. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రైతుల సమస్యలను తాను పరిష్కరిస్తానని కె ఏ పాల్ హామీ ఇచ్చారు. పొరపాటున కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని కె ఏ పాల్ చెప్పారు. కెసిఆర్ కు ఓటు వేస్తే అభివృద్ధి జరగదని కె ఏ పాల్ వెల్లడించారు. కాంగ్రెస్, బిజెపిలు అధికారంలోకి వచ్చినా ప్రజలకు చేసేది ఏమీ లేదని కే ఏ పాల్ తెలిపారు. కేవలం ఓట్ల కోసం మద్యం పంపిణీ చేస్తున్నారని, విచ్చలవిడిగా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని కేపాల్ ఆరోపించారు.

అంతేకాదు, సైకిల్ తొక్కుతూ పొలంబాట పట్టారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన మాటలు, హావభావాలతో రైతులను నవ్వించారు. రైతులతో కలిసి పత్తి ఏరారు. కేఏ పాల్ ప్రచారం చండూరు పరిధిలో సాగింది. అటు, బనియన్, పంచె, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ తో వాహనం నుంచి కూడా ఆయన ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

సైకిల్ సవారీ చేస్తూ ప్రచారంలో కేఏ పాల్ 

తాను ప్రపంచ రాజునంటూ చెప్పుకునే డాక్టర్ కేఏ పాల్ వ్యవహారం కాస్త కామెడీగా అనిపిస్తోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ..అందులో ఒక ఎమ్మెల్యే అభ్యర్ధిగా మునుగోడు ఉపఎన్నికల్లో నిలబడిన నిమిషం నుంచి ఆయన ప్రవర్తన, మాటలు, చేసే వాగ్దానాలు, ఇచ్చే హామీలు ఏ ఒక్కటి అక్కడి ప్రజలకు నమ్మకశ్యంగా లేకపోయినప్పటికి ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు. రైతులు, వ్యాపారులు, చేతివృత్తుల వారు ఇలా ఎవర్ని వదలడం లేదు కేఏ పాల్. మునుగోడులో అన్నీ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రచారం కంటే ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ మాత్రం అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..