Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ఆదివాసీ మహిళలతో కలిసి గుస్సాడీ నృత్యం చేసిన రాహుల్ గాంధీ.. వీడియో చూడండి

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఉల్లాసంగా.. ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రకు వస్తున్న వందలాది మందితో కలిసి రాహుల్.. తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

Rahul Gandhi: ఆదివాసీ మహిళలతో కలిసి గుస్సాడీ నృత్యం చేసిన రాహుల్ గాంధీ.. వీడియో చూడండి
Bharat Jodo Yatra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 29, 2022 | 11:17 AM

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఉల్లాసంగా.. ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రకు వస్తున్న వందలాది మందితో కలిసి రాహుల్.. తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివాసీలతో కలిసి గుస్సాడీ నృత్యం చేశారు. రాహుల్ తమతో కలిసి నృత్యం చేయడంతో ఆదివాసీ మహిళలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ తో కలిసి స్టెప్పేలు వేశారు. కొమ్ము కోయ కళాకారులతో కలిసి రాహుల్ ఉత్సాహంగా నృత్యం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివాసీల కళారూపం గురించి వివరించారు.

కాగా.. భారత్ జోడో యాత్రలో కొమ్ముకోయ కళారూపం ఆకట్టుకుంటోంది. ఈ సమయంలో రాహుల్ వారిని చూసి.. కోయ కళాకారులతో కలిసి నృత్యం చేశారు. భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క.. ఖమ్మం జిల్లాకు చెందిన ఆదివాసీలతో కొమ్ము కోయ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. దీనిని రాహుల్ మహబూబ్ నగర్ పాదయాత్రలో ఆసక్తిగా తిలకించినట్లు భట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొమ్ము కోయ ప్రదర్శనలో కళాకారులతో కలసి రాహుల్ లయబద్ధంగా అడుగులు వేస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.

విద్యారంగ సమస్యలపై మధ్యాహ్నం భేటీ.. 

రాహుల్ గాంధీ.. విద్యా సంబంధిత సమస్యలపై మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య వివిధ సంస్థలు, ప్రముఖులతో భేటీ కానున్నారు. పాలమూరు విద్యావంతుల వేదిక తరపున ప్రో. హరగోపాల్, రఘవాచారి, ఎం.వి ఫౌండేషన్ తరపున వెంకట్ రెడ్డి లతో పాటు స్వచ్చంద సంఘాల నాయకులు నీలిమ, విద్యార్థి నాయకులు తదితరులు రాహుల్ గాంధీతో ఎనుగొండ క్యాంప్ లో భేటీ కానున్నారు. సమగ్ర విద్యా విధానం, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థులకు కలుషిత ఆహారం, సౌకర్యాల లేమి, యూనివర్సిటీలలో సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

తెలంగాణలో నాలుగో రోజు శనివారం భారత్ జోడో యాత్ర మహబూబ్‌నగర్‌ ధర్మాపూర్ నుంచి ప్రారంభమైంది. ఇవాళ జడ్చర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది. ధర్మాపూర్ జంక్షన్లో కార్నర్ మీటింగ్ జరగనుంది. 20.3 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్రంలో సినీ నటి పూనమ్ కౌర్ కూడా పాల్గొని.. రాహుల్ తో ముచ్చటించారు.

Rahul Gandhi Poonam Kaur

Rahul Gandhi Poonam Kaur

కాగా.. భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట వస్తోన్న కార్యకర్తలు, అభిమానుల సందడితో పాదయాత్ర రూట్‌ కిక్కిరిసిపోయింది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఈ యాత్రలో రాహుల్ కేంద్ర, రాష్ట్ర ప్రభూత్వాల వైఫల్యాలపై గళమెత్తుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని.. పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు
పృథ్వీ రాజ్ చౌహాన్ కుల దేవత దివ్యకాంతి దర్శనం కోసం భారీగా భక్తులు
పృథ్వీ రాజ్ చౌహాన్ కుల దేవత దివ్యకాంతి దర్శనం కోసం భారీగా భక్తులు
మహేష్ బాబు కూతురు బ్యూటీఫుల్ వీడియో..
మహేష్ బాబు కూతురు బ్యూటీఫుల్ వీడియో..