Telangana High Court: మరికాసేపట్లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం..
Telangana High Court: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Telangana High Court: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు అధికారులు హాజరుకానున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సతీష్ చంద్ర శర్మను నియమించింది సుప్రీంకోర్టు కొలీజియం.
ఇదిలాఉండగా.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ను నియమించారు. ఈ నెల 13వ తేదీన అంటే బుధవారం నాడు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా హైకోర్టు న్యాయమూర్తులు, తదితరులు పాల్గొననున్నారు. ఈ ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం నాడు హైకోర్టులోని హాలులో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు.
Also read:
Bathukamma 2021: అయోమయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు.. క్లారిటీ ఇవ్వండి అంటున్న ప్రజలు..
India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. భారీగా తగ్గిన కేసులు, మరణాలు..
Oil Pulling: ఆయిల్ పుల్లింగ్‌తో అనారోగ్యానికి చెక్ పెట్టండి.. ఎలా చేయాలో తెలుసా?