India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. భారీగా తగ్గిన కేసులు, మరణాలు..

India Corona Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న

India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. భారీగా తగ్గిన కేసులు, మరణాలు..
India Coronavirus
Follow us

|

Updated on: Oct 11, 2021 | 9:51 AM

India Corona Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. 20వేల మార్క్ దాటి నమోదవుతున్న కరోనా కేసులు.. మళ్లీ 20వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,132 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 193 మంది మరణించారు. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. దాదాపు ఆరు నెలల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. దేశంలో ప్రస్తుతం 2,27,347 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 209 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు ఈ స్థాయిలో తగ్గినట్లు కేంద్రం తెలిపింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607 కి పెరిగింది. మరణాల సంఖ్య 4,50,782 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 21,563 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,93,478 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. కాగా దేశంలో రికవరీ రేటు భారీగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మార్చి తర్వాత రికవరీ రేటు 98శాతానికి పెరగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

దీంతోపాటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 95,19,84,373 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 10,35,797 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 58,36,31,490 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

Talaq – Khula: నువ్విస్తావా..? నేనివ్వాలా..? భర్తకు భార్య వార్నింగ్.. పాతబస్తీలో షాకింగ్ సీన్..

Crime News: ఉద్యోగం ఇప్పిస్తామంటూ వ్యభిచార రొంపిలోకి.. పాతబస్తీ బాలికలపై ముఠా కన్ను..