Bathukamma 2021: అయోమయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు.. క్లారిటీ ఇవ్వండి అంటున్న ప్రజలు..
Bathukamma 2021: తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు.
Bathukamma 2021: తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల వేడుక యావత్ తెలంగాణకు ఎంతో ప్రత్యేకం. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. అయితే, తెలంగాణ ఏర్పాటు తరువాత బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏటా ప్రభుత్వం తరఫున ఎంతో ఘనంగా ఈ వేడుకలను జరుపుతోంది. అయితే, ఈ ఏడాది సద్దుల బతుకమ్మ వేడుకల విషయంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. కానీ, ఈ ఏడాది మాత్రం కాస్త గందరగోళంనెలకొంది. బుధవారం నాడు అంటే 13వ తేదీనే సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని వేదపండితులు సూచిస్తున్నారు. కానీ, 06వ తేదీన ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు.. 14వ తేదీ గురువారం రోజులో తొమ్మిది రాత్రులు ముగియనున్నాయి. అయితే, 13వ తేదీనే దుర్గాష్టమి కావడం.. ఒక రోజు ముందుగానే సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని సూచించడంతో అయోమయం నెలకొంది. ఇక సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లపై అధికారుల్లోనూ అయోమయం నెలకొంది. దీంతో వేడుకల నిర్వహణ ఎప్పుడనే దానిపై అధికారిక ప్రకటన విడుదల చేయాలని మహిళలు కోరుతున్నారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుక విశేషాలు.. 9 రోజుల వేడుకలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేక ఉంది. ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పిలుస్తారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో పిలవగా.. చివరి రోజున సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. అసలు బతుకమ్మ ఏ రోజున మొదలవుతుంది.. ఏ రోజున ముగిస్తుంది.. ఏ రోజు ఏపేరుతో పిలుస్తారు.. ఏ రోజున ఏ రకమైన నైవేధ్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. 2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. 3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. 4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. 5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. 6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు. 7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. 9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.
Also read:
India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. భారీగా తగ్గిన కేసులు, మరణాలు..
Oil Pulling: ఆయిల్ పుల్లింగ్‌తో అనారోగ్యానికి చెక్ పెట్టండి.. ఎలా చేయాలో తెలుసా?
War on Plastic: నగరం నడిబొడ్డున 15 టన్నుల చెత్త వేశారు…ఎందుకంటే..?(వైరల్ వీడియో)