War on Plastic: నగరం నడిబొడ్డున 15 టన్నుల చెత్త వేశారు...ఎందుకంటే..?(వైరల్ వీడియో)

War on Plastic: నగరం నడిబొడ్డున 15 టన్నుల చెత్త వేశారు…ఎందుకంటే..?(వైరల్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 11, 2021 | 9:37 AM

వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం నేడు మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటిపై జరుగుతున్న చర్చల్లో ప్లాస్టిక్ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ భూతంపై నెల్లూరు జిల్లా యుద్ధం ప్రకటించింది.

వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం నేడు మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటిపై జరుగుతున్న చర్చల్లో ప్లాస్టిక్ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ భూతంపై నెల్లూరు జిల్లా యుద్ధం ప్రకటించింది. ముఖ్యంగా నెల్లూరు నగరం నుంచి ప్లాస్టిక్ ని తరిమేయాలని నిర్ణయించారు నేతలు, అధికారులు. దీనిపై అవగాహన కల్పించడంలో భాగంగా ఒకరోజులో చెత్తబుట్టల్లోకి పోయే ప్లాస్టిక్ పదార్థాలన్నిటినీ నగరం నడిబొడ్డున కుప్పగా పోశారు.

మొత్తం 15 టన్నుల ప్లాస్టిక్ అది. క్యారీ బ్యాగ్ లు, వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ పదార్థాలు అన్నీ వీటిలో ఉన్నాయి. వీటన్నిటిని నగరం నడిబొడ్డున ఉంచి అవగాహన కల్పించారు. ప్రతి రోజూ నెల్లూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున ప్లాస్టిక్ చెత్తబుట్టల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు.ప్లాస్టిక్ బ్యాగులు, ఫుడ్ ప్యాకేజీ కంటెయినర్లు పర్యావరణంలో కలిసేందుకు ఒక్కోసారి వెయ్యేళ్ల వరకు పడుతుందని నిపుణులు చెబుతున్నారు..నేల, నీటిలో కలిసే సమయంలో ఇవి కొన్ని హానికర రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో పండించే పంటలతోపాటు జల వనరులూ కాలుష్యం అవుతాయి. జలచరాల ప్రాణాలకూ ఇవి ముప్పు తెచ్చిపెడతాయి. అందుకే ప్లాస్టిక్‌ రహిత జీవన విధానం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. 
మరిన్ని చదవండి ఇక్కడ : News Watch: స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే.. ‘మా’రాజు విష్ణు… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

 Visakhapatnam Airport: విమానాశ్రయంలో గందరగోళం.. మహిళ బ్యాగులో బుల్లెట్స్..ఎలా వచ్చాయంటే..!(వీడియో)

 Warship in sea: సముద్రం అడుగునా.. మొదటి ప్రపంచ యుద్ధ నౌక.! వైరల్ అవుతున్న వీడియో..

 Samantha after Divorce: విడాకుల తర్వాత సమంత ఎక్కడుంటోంది..? మరిన్ని వివరాలు ఈ వీడియోలో…