AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam Airport: విమానాశ్రయంలో గందరగోళం.. మహిళ బ్యాగులో బుల్లెట్స్..ఎలా వచ్చాయంటే..!(వీడియో)

Visakhapatnam Airport: విమానాశ్రయంలో గందరగోళం.. మహిళ బ్యాగులో బుల్లెట్స్..ఎలా వచ్చాయంటే..!(వీడియో)

Anil kumar poka
|

Updated on: Oct 11, 2021 | 9:19 AM

Share

విశాఖ విమానాశ్రయంలో బులెట్లు కలకలం రేపాయి.. ఎయిర్‌ పోర్ట్‌ అధికారుల తనిఖీల్లో భాగంగా...సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ఓ ప్రయాణికురాలి బ్యాగ్‌లో 13 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఆర్‌కే బీచ్‌ సమీపంలో నివాసముంటున్న ఓ మహిళ..

విశాఖ విమానాశ్రయంలో బులెట్లు కలకలం రేపాయి.. ఎయిర్‌ పోర్ట్‌ అధికారుల తనిఖీల్లో భాగంగా…సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ఓ ప్రయాణికురాలి బ్యాగ్‌లో 13 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఆర్‌కే బీచ్‌ సమీపంలో నివాసముంటున్న ఓ మహిళ.. హైదరాబాద్‌ వెళ్లేందుకు ఇండిగో ఫ్లయిట్ టికెట్‌ తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో తనిఖీ చేసే సమయంలో ఆమె బ్యాగులో 13 బుల్లెట్లు ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. దీంతో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎయిర్‌పోర్టు పోలీసులు.

సదరు మహిళ బంధువు పిస్టల్‌ లైసెన్స్‌ కలిగి ఉన్నారని, ఇటీవల ఆయన చనిపోవడంతో.. ఆయన బ్యాగ్‌లో దుస్తులు పెట్టుకుని బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు తెలిపారు. బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్టు తాను గుర్తించలేదని ఆమె పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి ఆమెను విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
మరిన్ని చదవండి ఇక్కడ : Warship in sea: సముద్రం అడుగునా.. మొదటి ప్రపంచ యుద్ధ నౌక.! వైరల్ అవుతున్న వీడియో..

 Samantha after Divorce: విడాకుల తర్వాత సమంత ఎక్కడుంటోంది..? మరిన్ని వివరాలు ఈ వీడియోలో…

 MAA Elections Counting Live: చివరిదశకు చేరుకున్న ‘మా’ ఎన్నికల కౌంటింగ్.. ‘మా’ గెలుపెవరిది..?(లైవ్ వీడియో)

 Rakul Preet Singh To Marry Jackky Bhagnani: పెళ్లి పీటలు ఎక్కబోతున్నరకుల్.. పెళ్లి చేసుకోబోతున్న జాకీ భగ్నానీ గురించి విషయాలు..(వీడియో)